Home

»

Latest News

'శ్రీనివాస మంగాపురం' ఫస్ట్ రివ్యూ.. ఘట్టమనేని వారసుడు హిట్ కొట్టాడా.?

Jul 29, 2026 10:19AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని వారసుడు జయకృష్ణ టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ నాయికగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ లవ్, రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించారు. అశ్వినీదత్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమా రేపు(జూలై 30) ప్రేక్షకుల ముందుకు రానుంది.

'శ్రీనివాస మంగాపురం'పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమా చూసిన సన్నిహిత వర్గాలు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాయి. సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్‌ ఇచ్చింది. రన్ టైమ్ ను 2 గంటల 35 నిమిషాలు(155 నిమిషాలు)గా లాక్ చేశారు. 

ఈ సినిమా కథ ప్రధానంగా తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. శ్రీనివాస్ అలియాస్ వాసు బాబు (జయకృష్ణ), మంగతాయారు అలియాస్ మంగ (రషా తడానీ) మధ్య చిగురించిన గాఢమైన ప్రేమాయణం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే వీరి ప్రేమకు మైనింగ్ డాన్ వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) అడ్డుగా మారతాడు. అసలు వీరికి, వెంకటప్పయ్య నాయుడుకి సంబంధం ఏంటి? వీరి ప్రేమకథ రెండు వర్గాల మధ్య రక్తపాతానికి కారణం ఎలా అయింది? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

సెన్సార్ టాక్ తో పాటు, ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అందుతున్న ఫస్ట్ రివ్యూస్ ప్రకారం, అజయ్ భూపతి మార్క్ రొమాన్స్, లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు గ్రాండ్ లెవెల్‌లో రూపొందాయి. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా, తన మార్క్ ఇంటెన్స్ లవ్ స్టోరీలా దీనిని మలిచారు. కొత్త నటులైనప్పటికీ జయకృష్ణ, రషా తడానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని టాక్. మోహన్ బాబు విలనిజం, ఆయన డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. జయకృష్ణ, రషా తడానీ మధ్య లవ్ సీన్స్ ఎంత క్యూట్ గా ఉంటాయో, మోహన్ బాబు పాత్ర ఎంట్రీ తర్వాత సీన్స్ అంత ఎఫెక్టివ్ గా మారతాయని తెలుస్తోంది.

జూలై 30న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు మంచి లాంచ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

Srinivasa Mangapuram First Review, Jaya Krishna Ghattamaneni, Rasha Thadani, Ajay Bhupathi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com