Home

»

Latest News

శ్రీనివాస మంగాపురం ప్రమోషన్ల లోపం: బాక్సాఫీస్ వసూళ్లని దెబ్బతీసిన పబ్లిసిటీ గ్యాప్!

Aug 6, 2026 11:42AM

 

 

-గత నెల 30 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయిన జై కృష్ణ 
-తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ 
-కానీ కలెక్షన్స్ మాత్రం డల్
-కారణం అదేనా!


సెల్యులాయిడ్ కి,ఘట్టమనేని బ్రాండ్ కి ఉన్న అనుబంధం తెలిసిందే. రికార్డులైతే ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహంతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఘట్టమనేని మూడో తరం వారసుడు జై కృష్ణ 'శ్రీనివాస మంగాపురం'పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కలెక్షన్స్ మాత్రం షాక్ కి గురి చేస్తున్నాయి.

గత నెల చివర జులై 30 న రిలీజవ్వగా పర్లేదనే టాక్ అయితే  సొంతం చేసుకుంది. కానీ సరైన ప్రమోషన్స్ లేవు. అసలు  రిలీజ్ కి ముందు చేసిన ప్రమోషన్స్ విషయంలోనే   ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. ఇందుకు కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ హాజరు అవుతాడని అనుకున్నారు. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే క్యాన్సిల్ చేసారు. దీంతో     సినిమాకి  దక్కాల్సిన స్థాయి ప్రమోషన్లు దక్కకపోవడమే అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. నేటి డిజిటల్ యుగంలో ఎంత పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, సరైన పబ్లిసిటీ వ్యూహాలు లేకపోతే ప్రేక్షకులకి సినిమాని  రీచ్ చేయడం అత్యంత కష్టతరంగా మారుతోంది.అభిమానులు ఎలాగూ ఉంటారు. కానీ అంతిమంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావాలి.  అసలు వాళ్లంతా ముందు సినిమా గురించి మాట్లాడుకోవాలి కదా!. అలా జరిగేది ప్రమోషన్స్ వల్లనే అని మేకర్స్ కి తెలియని విషయం కాదు. రిలీజ్ తర్వాత ఒకే ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించడం గమనార్హం.


Also read: dhurandhar: ధురంధర్ పార్లమెంట్ దాడిలో చనిపోయిన కమలేష్ కుమారి యాదవ్ ఎవరో తెలుసా! 

 ప్రమోషన్ల ఖర్చులతో కలిపి సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం   , బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కనీసం 15 కోట్ల బ్రేక్ ఈవెన్ రాబట్టాల్సి ఉంది.  మొదటి రోజు  వరల్డ్ వైడ్ గా రెండున్నర కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఘట్టమనేని బ్యాక్ గ్రౌండ్ కి ఇది చాలా తక్కువ. ఇప్పటికి వచ్చి ఏమైంది రోజులు కాగా 5 .46 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి . పబ్లిసిటీ లోపమే కలెక్షన్స్ తక్కువగా రావడానికీ ప్రధాన కారణమని సినీ విశ్లేషకుల టాక్. . జై  కృష్ణ పెర్ ఫార్మెన్స్ అయితే  హీరో మెటీరియల్ రేంజ్ లోనే ఉంది. 

Srinivasa Mangapuram, Jai Krishna, Rasha Thadani

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com