శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్.. హీరో ఎవరో తెలుసా!
on Jul 18, 2025
'పుష్ప 2'(Pushpa 2)లోని స్పెషల్ సాంగ్ కి ముందు 'శ్రీలీల'(Sreeleela)సినీ కెరీర్ కొంచం డల్ గానే సాగిందని చెప్పవచ్చు. నిజానికి 'రవితేజ'(Raviteja)తో కలిసి చేసిన 'ధమాకా' తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ అవన్నీ ప్లాప్ గా నిలవడంతో కొత్త ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. కానీ పుష్ప 2 సాంగ్ తర్వాత మాత్రం మళ్ళీ ఆమె జోరు మొదలైంది. పైగా తెలుగు కంటే హిందీలో ఎక్కువ ఆఫర్స్ రావడం ప్రారంభించాయి.
ఈ కోవలోనే స్టార్ హీరో 'కార్తీక్ ఆర్యన్'(Kartik aaryan)తో కలిసి 'ఆషీకీ పార్ట్ 3'(aashiqui 3)ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కంప్లీట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. గతంలో తెరకెక్కిన 'ఆషీకీ' రెండు బాగాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర దర్శకుడు, అగ్ర నిర్మాత 'కరణ్ జోహార్'(Karan Johar)నిర్మించే ఒక భారీ చిత్రంలో కూడా 'జాన్వీకపూర్'(Janvi Kapoor)ప్లేస్ లో శ్రీలీల ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా 'శ్రీలీల'కి బాలీవుడ్ మరో అగ్ర హీరో 'రణవీర్ సింగ్' పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కబోతుందని, యానిమల్ ఫేమ్ 'బాబీడియోల్' కూడా ఒక కీలక పాత్రలో చేస్తున్నాడని, బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తుంది. మేకర్స్ ఇప్పటికే శ్రీలీల ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
శ్రీలీల ప్రస్తుతం నూతన హీరో 'కిరీటి' తో కలిసి చేసిన 'జూనియర్'(Juniour)అనే మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తుంది. 'రవితేజ'తో మరోసారి జత కడుతున్న 'మాస్ జాతర', 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ పై ఉన్నాయి, సుధా కొంగర(Sudha Kongara)దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ మూవీ 'పరాశక్తి' లో కూడా 'శ్రీలీల' హీరోయిన్ గా చేస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
