Home

»

Latest News

sree vishnu: బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన శ్రీవిష్ణు.. ఫ్యాన్స్ కి ఇక పండగే  

Jun 26, 2026 4:54PM

 

సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీ విష్ణు(sree vishnu)తన అప్ కమింగ్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్ తో థియేటర్స్ లోకి అడుగుపెట్టడానికి ముస్తాబవుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా విభిన్న సబ్జెట్స్ చేస్తూ వరుస విజయాల్ని అందుకుంటుండంతో కామ్రేడ్ కళ్యాణ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


 బాక్సాఫీస్ వద్ద ఈ నెల 19 న విడుదలైన 'దీవాన'(Deewana)మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో  గ్రాండ్ 'థ్యాంక్యూ మీట్' నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. 'దీవాన' ని  మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ చేశారు. శనివారం రోజున ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతి థియేటర్‌లోనూ, మొదటి 25 టికెట్లకు గానూ ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటే 'బై 1 గెట్ 1' ఆఫర్‌ను వర్తింపజేస్తున్నట్లు శ్రీవిష్ణు స్వయంగా ప్రకటించారు. ఈ వినూత్న ఆఫర్ వల్ల సినిమాకు మౌత్ పబ్లిసిటీ భారీగా పెరుగుతుందని, థియేటర్లలో లాంగ్ రన్ లభిస్తుందని ఆయన తన గట్టి నమ్మకాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందు  ఉంటారని ఈ నిర్ణయంతో మరోసారి నిరూపితమైంది.


Also read: shah rukh khan: నా భర్త కంటే మీరే ఇష్టం.. అభిమాని మాటకి షారుక్ అదిరిపోయే రిప్లై

 


  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com