Home

»

Latest News

'మేజ‌ర్' డైరెక్ట్‌గా ఓటీటీకి వెళ్ల‌లేదంటే కార‌ణం మ‌హేశ్‌!

May 21, 2022 5:00PM

 

అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన 'మేజ‌ర్' మూవీ జూన్ 3న విడుద‌ల‌వుతోంది. శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శోభిత దూళిపాళ ఓ కీల‌క పాత్ర చేసింది. 'గూఢ‌చారి' మూవీ త‌ర్వాత శేష్‌, ఆమె క‌లిసి న‌టించిన సినిమా ఇది. 'మేజ‌ర్' సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల‌వుతుందేమోన‌ని టీమ్ అంతా ఆందోళ‌న చెందామ‌నీ, కానీ మ‌హేశ్ బ్యాక్‌బోన్‌గా నిల్చొని థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌నీ శోభిత తెలిపింది.

'మేజ‌ర్' ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శ‌నివారం మీడియాతో మాట్లాడిన ఆమె, "మ‌హేశ్ నిర్మాణ సంస్థ‌లో ప‌నిచేయ‌డం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మహేష్ బాబు గారిది గ్రేట్ కెరీర్. అలాంటి సూపర్ స్టార్ తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో మొదటిసారి బయట సినిమా చేశారు. ఇది మాకు గొప్ప ఎనర్జీ నింపింది. కరోనా సమయంలో చాలా అందోళన పడ్డాం. మూవీ ఓటీటీకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. కానీ మహేష్ బాబు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. 'ఇది థియేటర్ సినిమా.. ఎట్టి పరిస్థితిలో థియేటర్ లోనే విడుదల‌వుతుంది' అని చెప్పారు. ఆయన మార్గదర్శకం, ప్రోత్సాహం మాలో గొప్ప నమ్మకాన్ని నింపింది. మంచి నిర్మాణ సంస్థలో పని చేశాననే ఆనందం వుంది." అని చెప్పింది.

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ క్యారెక్ట‌ర్‌లో ఇమిడిపోవ‌డానికి అడివి శేష్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని ఆమె తెలిపింది. "అడివి శేష్ చాలా కష్ట పడతారు. శరీరంలో చాలా మార్పులు ఉండేవి. బాడీని చూపించాలంటే ఒక ఒక మోటివేషన్ తో ఎవరైనా కష్టపడతారు. కానీ ఆర్మీ మ్యాన్ గా కనిపించడానికి బాడీని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కానీ అలా కనిపించాలంటే చాలా కష్టపడాలి. మేజర్ సందీప్ తల్లితండ్రులకు ఈ కథ చాలా సున్నితమైన అంశం. వారు సినిమా చూసి గర్వపడాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు." అని చెప్పుకొచ్చింది శోభిత‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com