Home

»

Latest News

శ్రుతి బ‌ర్త్ డే స్పెష‌ల్ః `స‌లార్` లుక్!

Jan 25, 2022 11:40AM

గ‌త ఏడాది సంక్రాంతికి ఎంట‌ర్టైన్ చేసిన `క్రాక్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసింది చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్. ఆపై త‌న ల‌క్కీ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా `వ‌కీల్ సాబ్`లోనూ కాసేపు క‌నిపించి మురిపించింది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ చిత్రాలే... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి జోడీగా న‌టిస్తున్న `స‌లార్`, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కి జంట‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న `ఎన్బీకే 107`, మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న పేరు నిర్ణ‌యించ‌ని సినిమా.

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 28 శ్రుతి హాస‌న్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిరంజీవి - బాబీ కాంబినేష‌న్ మూవీలో శ్రుతి ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. అంతేకాదు.. `స‌లార్`లో ఆమె పోషిస్తున్న పాత్ర తాలుకూ ఫ‌స్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయ‌నున్నార‌ని బ‌జ్. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. నిరుడు శ్రుతి పుట్టిన‌రోజునే `స‌లార్`లో ఆమె ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. స‌రిగ్గా ఏడాది అనంత‌రం ఆమె ఫ‌స్ట్ లుక్ రానుండ‌డం ఆస‌క్తిక‌రం. మ‌రి.. రాబోయే ఈ మూడు బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో తెలుగునాట శ్రుతి ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com