Home

»

Latest News

రామ్ చరణ్‎కు నేషనల్‌ అవార్డు పక్కా.. చిరంజీవి బర్త్ డేకి  నేను బ్లడ్ ఇచ్చాను!

May 25, 2026 7:02PM

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ ప్రెస్ మీట్ ఈవెంట్‌లో పాల్గొన్న శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar).. రామ్‌చరణ్ డెడికేషన్, మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలో రామ్‌చరణ్ జర్నీని తాను మొదటి సినిమా నుంచి గమనిస్తున్నానని శివ రాజ్‌కుమార్ ఈవెంట్‌లో పేర్కొన్నారు. చరణ్ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆయన పడిన కష్టం, చూపిస్తున్న సిన్సియారిటీయేనని కొనియాడారు. చరణ్ వెనుక తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. 

ఒక సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య కనిపించిన ఆ అప్యాయత, అనుబంధం తన హృదయాన్ని ఎంతగానో తాకిందని.. తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను తాను ఎలా చూసుకునేవాడినో, చరణ్‌ను పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారని ఎమోషనల్ అయ్యారు.

‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని శివరాజ్‌కుమార్ చెప్పారు. ఈ చిత్రంలో చరణ్ కనబరిచిన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌కు కచ్చితంగా నేషనల్ అవార్డ్ రావాలనేది తన బలమైన కోరిక అని శివన్న ఆకాంక్షించారు. ఈ సినిమాలో చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, హోల్ యూనిట్ అందించిన లవ్ అండ్ అఫెక్షన్‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న ప్రత్యేక బాండింగ్ గురించి చెప్తూ.. గతంలో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కు తాను స్వయంగా వెళ్లి రక్తం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మెగా ఫ్యామిలీపై అభిమానులు చూపిస్తున్న ఈ అప్యాయత ఇలాగే కొనసాగాలని ఆశించారు. కర్ణాటక ప్రజలకు భాషా భేదాలు ఉండవని, మంచి సినిమాను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని చెప్తూ, ‘పెద్ది’ సినిమాలో అవకాశం రాగానే తాను ఎంతో ఎగ్జైట్ అయి చరణ్‌కు ఫోన్ చేశానని, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు.

ఈ సినిమా కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాదు.. మనిషికి, ఆటకు మధ్య ఉండే ఒక బలమైన ఎమోషన్ అని శివరాజ్‌కుమార్ విశ్లేషించారు. మనం ఎందుకు ఆడుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం అనే పాయింట్‌ను దర్శకుడు బుచ్చిబాబు ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారని ప్రశంసించారు. 'పెద్ది' పాత్ర థియేటర్ల నుంచి బయటకు వచ్చినా అందరి గుండెల్లో నిలిచిపోతుందని, జూన్ 4న విడుదల కాబోతున్న ఈ అద్భుతమైన సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శివ రాజ్‌కుమార్ తెలిపారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com