Home

»

Latest News

క్రేజీ కాంబో: ‘ఇరుముడి’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. హీరో ఎవరో తెలిస్తే షాకవుతారు.!

Sep 4, 2026 9:57AM

'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత, ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఇరుముడి' ప్రాజెక్ట్ తెచ్చిపెట్టిన సక్సెస్ జోరులో ఉన్న శివ నిర్వాణ, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా కథను ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు సడన్‌గా అనుకున్నది కాదట. 'ఇరుముడి' సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ధనుష్‌తో శివ నిర్వాణ కథా చర్చలు జరిపారట. శివ చెప్పిన విభిన్నమైన లైన్ ధనుష్‌కి బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరి మధ్య ప్రాథమికంగా డీల్ ఓకే అయిందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

ఒకవైపు హ్యూమన్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను ఎంతో హృద్యంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ, మరోవైపు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్ ధనుష్. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద ఎమోషన్స్ ఏ స్థాయిలో పండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్‌కు ఇప్పటికే 'సార్', 'రఘువరన్ B.Tech' వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ చాలా బలమైన మార్కెట్ ఉంది. సరైన ఎమోషనల్ కథ పడితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ, త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 'ఇరుముడి' సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట.

 

 

 

[Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Dhanush, Telugu Film News, Telugu News, Tollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com