
అల వైకుంఠపురంలో నటకిరీటి రాజెంద్ర ప్రసాద్ నోటి నుంచి' ఈ డబ్బున్న వాళ్ళందరూ తెలివి గల వాళ్ళు అనుకుంటాం గాని, అదృష్టవంతులు అంతే' అనే డైలాగ్ వస్తుంది. సేమ్ అదే డైలాగ్ సినిమా డైరెక్టర్ లలో కొంత మందికి అప్లై చెయ్యాలేమో. ఎందుకంటే ఈ మధ్యన తమ సినిమాల గురించి దర్శకులు మాట్లాడే తీరు అదే విధంగా ఉందని సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులు డిస్కర్స్ చేసుకుంటున్నారు.
దర్శకుడు తన మస్తిష్కంలో సినిమా ఎలా ఉందో ఆలోచించేస్తాడు. సినిమా తెరకెక్కించడానికి ప్రస్తుత సొసైటీ ఎలా ఉంది, ఎలాంటి సినిమాని చూస్తారు. స్టార్ హీరోని ఎలాంటి సబ్జెట్ లో చూపించాలి, ఇలా ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకొని సినిమా తెరకెక్కిస్తాడు. అందుకు ఎన్నో సంవత్సరాలు కష్టపడతాడు. కానీ కొంత మంది దర్శకులు ఆ కష్టానికి తమ స్పీచ్ తో వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు. ప్రచార వేదికలపై దర్శకులు మాట్లాడే మాటలు, ఇచ్చే ఎలివేషన్లు సినిమా అంచనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అయితే 90 శాతం మంది దర్శకులు సినిమా కథ, నిర్మాణం, టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడటం మానేశారు. హీరోల భజన చేయడం, మితిమీరిన హైప్ ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. "ఈ సినిమాతో బాక్సాఫీస్ షేక్ అవుతుంది", "మా హీరో విశ్వరూపం చూస్తారు", "క్లైమాక్స్ 40 నిమిషాలు సీటు అంచున కూర్చుంటారు" అంటూ ఇచ్చే అతిజాగ్రత్త లేని ప్రకటనలు ప్రేక్షకుల్లో ఆకాశాన్ని తాకేలా అంచనాలను పెంచేస్తున్నాయి. తీరా థియేటర్‌కు వెళ్లాక కంటెంట్ సాధారణంగా ఉంటే, ఆ ఓవర్ హైప్ వల్ల అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ మైక్ పట్టుకుంటే సినిమాపై క్యూరియాసిటీ పెరిగేది, కానీ నేటి వ్యాపారాత్మక ప్రసంగాలు సినిమాలోని అసలు ఆత్మని దెబ్బతీస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం, దాదాపు 75 శాతం మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రైలర్లు ప్రీ రిలీజ్ స్పీచ్‌లను చూసే థియేటర్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే, ఓవర్ హైప్ ప్రసంగాల వల్ల మొదటి రోజు మొదటి షోకే 50 శాతం అంచనాలు తలక్రిందులై నెగెటివ్ టాక్ రావడానికి కారణమవుతోందని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు. దర్శకుడు వేదికపై చూపించాల్సిన ఉత్సాహం సినిమా కథ పట్ల ఉండాలి కానీ, హీరోల ఇమేజ్ పెంపొందించడంపై కాదు. కొద్దిమంది దర్శకులు ఇప్పటికీ తమ స్పీచ్‌లలో సినిమా ప్రాసెస్, కథలోని ఎమోషన్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ 100 శాతం ప్రామాణికతను కాపాడుకుంటున్నారు. కొంత మంది దర్శకులు అయితే సినిమాపై ఉన్న హైప్ ని తమ మాటలతో తగ్గించేస్తునారు. ఇటీవల జరిగిన ఒక అప్ కమింగ్ మూవీ ఫంక్షన్ నే ఉదాహరణ తన చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, టైటిల్ పై ఎలాంటి భావంతో ఉన్నారో తెలియకుండానే ఎలా పడితే అలా మాట్లాడేసి తన కష్టాన్ని తానే తగ్గించుకున్నాడు. ఆ దర్సకుడు ఒక్కడే కాదు, చాలా మంది అదే రూట్ లో తమ కష్టాన్ని తగ్గించుకుంటున్నారు.
Also Read: దయచేసి అర్ధం చేసుకోండి.. ఫ్యాన్స్ విన్నపం
అసలు ఒకప్పుడు సినిమా విడుదలవుతోందంటే గోడల మీద పోస్టర్లు, రేడియో ప్రసారాలు, పత్రికా ప్రకటనలే ప్రచార సాధనాలుగా ఉండేవి. దర్శకులు అస్సలు మైక్ ముందుకొచ్చి మాట్లాడేవారే కాదు. వారు తమ భావాలని , ప్రతిభని తమ సినిమాల్లోనే చూపించేవారు. విశ్వనాథ్, బాపు, జంధ్యాల, కోడి రామకృష్ణ లేదా మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు వేదికలెక్కి గంటల తరబడి ప్రసంగాలు ఇవ్వకపోయినా, వారు తీసిన సినిమాలు థియేటర్ల వద్ద 100 రోజులు, 175 రోజుల పాటు హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేసేవి. కేవలం కథ, కథనం, మేకింగ్ మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి. ఇప్పటికి రప్పిస్తాయి. వైరల్ కోసం అతిగా మాట్లాడినా సినిమా చూద్దామని ఎప్పుడో ఫిక్స్ అయినవాడే వస్తాడు. కొత్త ప్రేక్షకుడు వెనకడుగు వేస్తాడు.
Director, Cinema, Tollywood






