డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్.. నెక్స్ట్ ఏంటి?
on Apr 19, 2025
మలయాళ నటుడు 'షైన్ టామ్ చాకో'(Shine Tom chacko)కొచ్చిలోని ఒక హోటల్ లో డ్రగ్స్ తీసుకుంటున్నాడన్న సమాచారం రావడంతో నార్కెటిక్ బృందం సదరు హోటల్ కి వెళ్ళింది. కానీ ఈ బృందం హోటల్ కి రావడానికి ముందే మూడో అంతస్థులో ఉన్న షైన్ కిటికీ లో నుంచి రెండో అంతస్తులోకి దూకి పారిపోయాడు. పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారడంతో షైన్ కి సమన్లు జారీ చేసి విచారణకి హాజరు కావాలని పోలీసులు ఆదేశించడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం తన లాయర్ తో కలిసి ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
విచారణ అనంతరం షైన్ ని అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు అధికారకంగా ప్రకటించారు. త్వరలోనే వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్టుగా తెలియచేసారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ మలయాళ నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)మాట్లాడుతు 'షైన్' సినిమా సెట్స్ లో డ్రగ్స్ సేవించి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, కేరళ ఫిలిం చాంబర్ తో పాటు అమ్మ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసింది. దీంతో షైన్ అరెస్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. 2002 లో సినీ రంగ ప్రవేశం చేసిన షైన్ ఇప్పటి వరకు మళయాళంతో పాటు ఇతర భాషల్లో కలిపి సుమారు 100 కి పైనే సినిమాలు చేసాడు. నాచురల్ స్టార్ నాని హీరోగా 2023 లో రిలీజైన 'దసరా'(Dasara)మూవీతో షైన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమమయ్యాడు. రంగబలి, రాబిన్ హుడ్, డాకుమహారాజ్' వంటి సినిమాల ద్వారా మరింతగా దగ్గరయ్యాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
