సీనియర్ నటి భానుప్రియ తల్లి లక్ష్మి(83) 22 మార్చి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూసినట్టు ఆలస్యంగా అందిన సమాచారం. ‘సితార’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన భానుప్రియ. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఒక దశలో టాప్ హీరోయిన్ అనిపించుకున్నారు. భానుప్రియ సోదరి శాంతి ప్రియ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు.
భానుప్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే తండ్రి పండుబాబు కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని పెంచి సినిమాల్లో అవకాశాలు రావడానికి తోడ్పడ్డారు తల్లి లక్క్ష్మీ. భానుప్రియ, శాంతిప్రియలకు మాతృవియోగం జరిగిందన్న వార్తతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.





