Home

»

Latest News

స‌త్యం రాజేష్ 'టెనెంట్' నుంచి 'నా క‌థ‌లో నువ్వున్నావా' సాంగ్ విడుద‌ల

Dec 27, 2023 6:20PM

'మా ఊరి పొలిమేర‌-2' సంచ‌ల‌న విజ‌యంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం 'టెనెంట్‌'. మేఘా చౌద‌రి క‌థానాయిక‌. చంద‌న ప‌యావుల‌, భ‌ర‌త్ కాంత్‌, తేజ్ దిలీప్‌, అడుకలం న‌రేష్‌, ఎస్తేర్ నోరోన్హ త‌దిత‌రులు ముఖ్య‌పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధ‌ర్ ద‌ర్శ‌కుడు. మ‌హాతేజ క్రియేష‌న్స్ ప‌తాకంపై మోగుళ్ళ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మాత‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ ట్రైల‌ర్‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈచిత్రం నుంచి సాహిత్య సాగ‌ర్ లిరిక్స్‌తో పాటు ట్యూన్ అందించిన మెలోడి సాంగ్ నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా? నా జ‌త‌గా రానున్న‌వా... నీ జ‌త‌నై ర‌మ్మంటావా? అనే లిరిక‌ల్ వీడియో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. 

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ "చిత్రంలో భార్యాభ‌ర్త‌ల అనురాగాన్ని, అప్యాయ‌త‌ను తెలియ‌జేసే పాట ఇది. ఈ బ్యూటిఫుల్‌మెలోడి సాంగ్ అంద‌రికి న‌చ్చుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్ర‌యిల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. జీవితం ఆడే వైకుంఠ‌పాళిలో ఎంచుకున్న పాచిక‌ల్లాంటి ఆరు ముఖ్య‌పాత్రల‌కి మ‌ధ్య జ‌రిగే క‌థే ఈ చిత్రం.ముఖ్యంగా ప్ర‌స్తుత అర్భ‌న్‌లైఫ్ స్ట‌యిల్‌ని ప్ర‌తిబింబిస్తూ మ‌హిళ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా వుండాలో చెబుతూ, వాళ్ల‌ని అల‌ర్ట్ చేసే విధంగా తీర్చిదిద్ద‌బ‌డ్డ ఈ క‌థ‌, క‌థ‌నం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది" అన్నారు. 

ధ‌నా బాల‌, చందు, అనురాగ్‌, ర‌మ్య పొందూరి, మేగ్న త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగ‌ర్‌ సంగీతం అందిస్తుండగా, డీఓపీగా జెమిన్ జోం అయ్య‌నీత్‌, ఎడిట‌ర్‌ గా  విజ‌య్మక్త‌వ‌ర‌పు వ్యవహరిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com