పృథ్వీతో ఆటాడుకుంటున్న 'జబర్దస్త్'
on Feb 5, 2020

అర్హత లేని వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఏమవుతుందో... మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. సింహాసనం, శునకం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ పృథ్వి అది నిజమని మరోసారి నిరూపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవి ఇస్తే ఏం చేశారో తెలుగు ప్రజలందరికీ తెలుసు. మహిళా అధికారితో ఫోనులో రాసలీలల సంభాషణ లోకమంతా వింది. అప్పటి నుండి ఆయన మీమ్ మేకర్స్ కు మంచి మెటీరియల్ గా మారారు.
సోషల్ మీడియాలో పృథ్వీపై పంచుల మీద పంచులు పడుతున్నాయి. ''వెనక నుండి వచ్చి వాటేసుకుందాం అనుకున్నా. నువ్వు అరుస్తావ్ ఏమోనని ఊరుకున్నా" డైలాగ్ మోస్ట్ పాపులర్ అయింది. మీమ్ మేకర్స్ ఆ డైలాగ్ ను పట్టుకుని కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్ తో 'జబర్దస్త్' బ్యాచ్ కామెడీ చేస్తుంది. ఈవారం టెలికాస్ట్ కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో పృథ్వీని ఓ ఆట ఆడుకున్నారని ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఏదో ఒక్క స్కిట్ లో కాదు... రెండు స్కిట్స్ లో 'వెనకనుండి వచ్చి వాటేసుకుందాం అనుకున్నా" డైలాగ్ మీద కామెడీ చేశారు. ఒక స్కిట్ లో అయితే "కలిసినప్పుడు ఇటువంటి మాటలు చెబుతావు. ఫోన్లో చెప్పవు" అని లేడీ గెటప్ వేసిన కమెడియన్ అంటే... "ఫోనులో ఇలాంటి మాటలు మానేశాం గా" అని ఇంకో కమెడియన్ రిప్లై ఇస్తాడు. జబర్దస్త్ బ్యాచ్ అందరూ పృధ్విని గట్టిగా టార్గెట్ చేసినట్లు ఉన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఆయన చేసిన రాసలీలలు కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ వాయిస్ ఫైల్స్ మీడియాలోకి వచ్చిన తర్వాత తన వాయిస్ ను ఎవరో మార్ఫింగ్ చేశారని, తాను నిర్దోషి అని, తన నిజాయితీని నిరూపించుకుంటామని పృథ్వీ భారీ డైలాగులు చెప్పారు. తర్వాత సైలెంట్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ఎప్పుడు నిరూపిస్తారో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



