
-సినిమా పేరు: సర్ధార్ 2
-నటీనటులు: కార్తీ, మాళవిక మోహనన్, ఆషికా రంగనాధ్, ఎస్ జె సూర్య, నాజర్, అచ్యుత్ కుమార్, ఆశిష్ విద్యార్థి, యోగి బాబు తదితరులు
-సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
-ఎడిటింగ్: విజయ్
-మ్యూజిక్: సామ్ సి యస్
-నిర్మాతలు: లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా
-బ్యానర్స్: ప్రిన్స్ పిక్చర్స్, ఐ వి వై ఎంటర్ టైన్ మెంట్
-రచన,దర్శకత్వం: పి. ఎస్. మిథ్రాన్
-రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 10 ,2026
కార్తీ ఈ రోజు సర్ధార్ 2 తో థియేటర్స్ లోకి వచ్చాడు. కార్తీ నుంచే 2022 లో వచ్చిన సర్దార్ కి సీక్వెల్ . మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశం 'మిషన్ డోకు' పేరుతో 'డోకు' అనే ఒక ఆయుధాన్ని వేరే దేశానికి పంపించే క్రమంలో ఇండియాని ఎక్స్ చేంజ్ ప్లేస్ గా' ఎంచుకుంటుంది. కానీ ఎక్స్ చేంజ్ చేసే ప్రాసెస్ లో ఇండియాలో పడిపోతుంది. దీంతో ఇండియన్ గవర్నమెంట్ ప్రజల రక్షణ కోసం తల్లడిల్లిపోతుంటుంది. ఎందుకంటే డోకు అనేది విశ్వంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. దాని వల్ల మానవాళి మొత్తం సర్వనాశనం అవుతుంది. డోకు వల్ల మానవాళికి జరిగే ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం జరిగిందా? జరగకపోతే ఆపింది ఎవరు? అది ఎలా సాధ్యమైంది? సర్దార్( కార్తీ) విజయ్(కార్తీ), యోగానంద్ (ఎస్ జె సూర్య) ల క్యారెక్టర్స్ కి మిషన్ డోకుకి మధ్య సంబంధం ఏంటనేదే సర్దార్ 2
ఎనాలసిస్
ఇలాంటి కథలని తెరకెక్కించడానికి ఎంతో మైండ్, లొకేషన్స్, నిర్మాణ విలువలు, నటీనటుల తపన చాలా ముఖ్యం. అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. . కాకపోతే కథ యొక్క అసలు ఉద్దేశ్యం తెలిసాక కరోనా మహమ్మారి గుర్తుకు రావడం, ఆ పాయింట్ తో ఇప్పటికే సినిమాలు వచ్చి ఉండటం కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. పైగా మనం నిత్య జీవితంలో హెల్త్ కోసం ఉపయోగించే యాంటీ బయోటిక్ టాబ్లెట్స్ తో పాటు నాన్ వెజ్ ఫుడ్ విషయంలో చెప్పిన మాటలు ఆలోచనలో పడేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే సినిమా స్టార్టింగ్ నుంచే సీన్స్ అన్ని కొత్తగా క్యూరియాసిటీగా సాగాయి. విజయ్, యోగిబాబు, నిళళ్ గల్ రవి సీన్స్ బాగానే ఉన్నాయి. విజయ్ కి సర్ధార్ బతికే ఉన్నాడని తెలిసే ఎపిసోడ్ ని బాగా ప్లాన్ చేసి ఉండాల్సింది. జార( మాళవిక మోహన్) సీన్స్ తో పాటు మిగతా ఇద్దరు టీం ఎపిసోడ్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టెప్ బై స్టెప్ కథ చెప్పే విధానం వర్క్ అవుట్ అయ్యింది .సర్దార్ టోటల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్ ఒక లెవల్. యోగానంద్( ఎస్ జె సూర్య) ఇంట్రడక్షన్ సూపర్.ఇంటర్వెల్ బాంగ్ పర్లేదు.సెకండ్ హాఫ్ లో చూసుకుంటే కథనం చాలా ఫాస్ట్ గా సాగింది. సీన్స్ అన్ని కూడా యాక్షన్ మోడ్ లోనే సాగడంతో ఏ సెకను ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ కలిగించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.ముఖ్యంగా యోగిబాబు, నిళళ్ గల్ రవి ని కూర్చోబెట్టి యోగానంద్ చెప్పే ఆరోగ్య రహస్యానికి సంబధించిన సీన్ అయితే బాగా పేలింది. మూసుకుపోయిన మన కళ్ళు తెరిపించడం ఖాయం. ప్రీ క్లైమాక్స్ బాగా వర్క్ అవుట్ అయినా క్లైమాక్స్ లో విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని సర్దార్ నే తీసుకొని ఉండాల్సింది. ఎట్ లీస్ట్ విజయ్ నే సర్దార్ ని ఆ నిర్ణయం తీసుకోమని చెప్పి భావోద్వేగం మధ్య విజయ్ నిర్ణయాన్ని సర్ధార్ అమలు చేయాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
సర్దార్, విజయ్ గా రెండు క్యారెక్టర్స్ లో కార్తీ మెప్పించాడు. ముఖ్యంగా యంగ్ సర్దార్ పెర్ఫార్మెన్స్ హైలెట్. మాళవిక మోహన్, ఆషికా రంగనాధ్, అచ్యుత్ రామన్,నాజర్ తో పాటు మిగతా ఆల్ ఆర్టిస్ట్స్ క్యారక్టర్ కి తగ్గ పెర్ఫార్మ్ తో తమ హవాని చాలా బలంగానే చాటారు. ముఖ్యంగా నెగిటివ్ రోల్ చేసిన ఎస్ జె సూర్య మరో సారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మిత్రన్ దర్శకుడిగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. కానీ డైలాగ్స్ మాత్రం అంతగా బాగోలేదు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు ప్రధాన బలం. ఉన్న ఒకే ఒక సాంగ్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సో.
బలాలు
1 కథనం
2 . కార్తీ తో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్
3 . డైరెక్షన్
4 . ప్రొడక్షన్ వాల్యూస్
బలహీనతలు
1 కథ
2 . క్లైమాక్స్
చివరిగా చెప్పుకోవాలంటే సర్దార్ 2 బోర్ కొట్టకుండా చెయ్యడంలో కార్తీ తో పాటు మేకర్స్ చాలా కష్టపడ్డారు.
రేటింగ్ 2 .25 /5 అరుణాచలం





