సంక్రాంతికి వస్తున్నాంపై తెలంగాణ మంత్రి కామెంట్స్
on Jan 25, 2025
విక్టరీ వెంకటేష్(Venkatesh)హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi)దర్సకత్వంలో దిల్ రాజు(Dil Raju)నిర్మించిన మూవీ'సంక్రాంతికి వస్తున్నాం'.(Sankrathiki vasthunnam)సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా అనేక రికార్డులని నెలకొల్పుతుంది.ఇప్పటికే 200 కోట్ల పైన కలెక్షన్స్ ని రాబట్టిందంటే 'సంక్రాంతికి వస్తున్నాం' సునామీని అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా ఈ మూవీ గురించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat reddy)మాట్లాడుతు 'సంక్రాంతికి వస్తున్నాం' చిన్న చిత్రంగా విడుదలై భారీ చిత్రాలతో సమానంగా వసూళ్లు సాధించిందన్నారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే 'లవ్ యు ఫాదర్' చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసిన సందర్భంగా ఆయన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గురించి వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.
ఇంకా ఆయన మాట్లాడుతు అర్ధవంతమైన కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చే చిత్రాలకు ఎప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది,భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించామని అదనపు షోలు, టికెట్ రేట్స్ ఎక్కువ పెంచుకోవడానికి అనుమతి కోసం వచ్చే బదులుగా కథా బలం ఉన్న చిత్రాలపై సినీ పరిశ్రమ దృష్టి సారించాలని చెప్పారు.అదే విధంగా 'లవ్ యు ఫాదర్'(Love You Father)సినిమా విజయవంతం కావాలని చిత్ర నటీనటుల్ని,దర్శక నిర్మాతలని కూడా అభినందించడం జరిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
