
'పెద్ది’ని చూసినవాళ్లంతా కంప్లీట్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో అంటున్నారు. పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సినీ సెలబ్రిటీలు సైతం పెద్దిని వీక్షించేందుకు ప్రీమియర్స్ నుంచే పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు. ఈ కోవలోనే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ లో స్క్రీనింగ్‌కి హాజరయ్యారు.
సినిమా పూర్తి చేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తున్న సందీప్ రెడ్డిని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు, అభిమానులు మూవీ ఎలా ఉంది సర్ అని అడిగారు దాంతో సందీప్ రెడ్డి చాలా బాగుంది’ అని తన రివ్యూ ఇచ్చారు.ఇప్పుడు ఈ రివ్యూ మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది. సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాదు, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి చిత్ర పరిశ్రమ నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
also read: Nushrratt bharuccha: ఇన్‌స్టా పోస్ట్‌లో అశ్లీల శబ్దాలు.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్
350 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. దాదాపు 189 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో వన్ మ్యాన్ షోలా ముందుకు నడిపారనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం యాసలో రామ్ చరణ్ పలికిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని సులువుగా దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుక్‌మైషోలో గంటకు 43 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడవుతుండటం పెద్ది క్రేజ్‌కి నిదర్శనం.




