Home

»

Latest News

Samantha: తెలివిగా తప్పించుకున్న సమంత.. కానీ చరణ్ వల్ల  సమస్య తప్పదా!

May 15, 2026

 


సమంత(Samantha)యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల గుండెల్లో పదికాలాల పాటు నిలిచేలా చేయగలదు. హీరో కట్ అవుట్ రేంజ్ కూడా తన సొంతం. సమంత లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' మ్యారేజ్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ కావలసి ఉండగా వాయిదా పడింది. 

ఈ వాయిదా వెనుక అసలు కారణం ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకి  విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ తరుణంలో సినిమాని థియేటర్లలోకి తీసుకువస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భావించారు. 

ఈ వాయిదా ప్రకటనతో పాటే చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌ని విడుదల చేస్తూ జూన్ 19  కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. 'ఇట్స్ టైమ్ టు పుల్ ద ట్రిగ్గర్' అంటూ సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టర్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇందులో సమంత చేతిలో గన్ పట్టుకుని, ఎంతో రగ్గడ్ లుక్‌లో, సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తోంది. సాంప్రదాయ కుటుంబంలో ఉండే ఒక సాధారణ గృహిణికి వెనుక ఉన్న ఒక వయలెంట్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సమంత కెరీర్‌లోనే మొదటిసారిగా డూప్ లేకుండా రియల్ యాక్షన్ స్టంట్స్ చేయడం, అది కూడా చీర కట్టుకుని ఫైట్స్ చేయడం  ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 

Also read: Karuppu: వీరభద్రుడు హైలెట్స్ ఇవే.. ఫ్యాన్స్, పబ్లిక్ రియాక్షన్ ఇదే 


అయితే ఈ జూన్ 19 రిలీజ్ డేట్ వెనుక పెద్ద సవాలే ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూన్ మొదటి వారంలోనే రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఒకవేళ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే, థియేటర్ల లభ్యత విషయంలో 'మా ఇంటి బంగారం' చిత్రానికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. సమంత స్వయంగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా సక్సెస్ ఆమె సోలో బాక్సాఫీస్ స్టామినాకు ఎంతో కీలకం కానుంది. సమంత భర్త ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు కథ అందించాడు. నందిని రెడ్డి(Nandini Reddy)దర్శకురాలు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com