ఇప్పుడు నాకు చాలా ఫన్ గా ఉందంటున్న సమంత.ఎందుకో తెలిస్తే మీరు షాక్ అవుతారు
on Jan 11, 2025
స్టార్ హీరోయిన్ సమంత(samantha)రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావన్ తో కలిసి 'సిటాడెల్ హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజైన ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందననే అందుకుంది.ఈ సిరీస్ కోసం సమంత ఎంతో కష్టపడి ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో చేసింది.కానీ ఆమె క్యారక్టర్ కి అంత ఆదరణ కూడా రాలేదు.తన సొంత బ్యానర్ లోనే మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా స్టార్ట్ చేసింది.కానీ ఆ మూవీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ దశలోకి వెళ్ళలేదు.
ఇక సమంత పర్సనల్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటూ తనకి సంబంధించిన ప్రతి విషయాన్నీ వాళ్లతో పంచుకుంటు ఉంటుంది.ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తనకి చికెన్ గున్యా సోకిందని,కానీ ప్రస్తుతం కోలుకుంటున్నానని,ముఖ్యంగా చికెన్ గున్యా వల్ల వచ్చే కీళ్ళనొప్పుల వల్ల కోలుకోవడంలోను చాలా ఫన్ ఉంటుందంటూ,జిమ్ లో వ్యాయామం చేస్తున్న పిక్ ఒక దాన్ని ఇన్ స్టా స్టోరీ లో షేర్ చేసింది.దీంతో హెల్త్ జాగ్రత్త అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read