Home

»

Latest News

ఓటీటీలోకి సాయి పల్లవి ఫస్ట్ హిందీ మూవీ.. అసలు ట్విస్ట్ ఇదే.!

Jul 15, 2026 5:15PM

సాయి పల్లవి అంటేనే వెండితెరపై ఒక మ్యాజిక్. డ్యాన్స్ అయినా, నటన అయినా ఆమె పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవ్వని వారుండరు. ప్రస్తుతం 'రామాయణం', 'ఓమ్' వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌లో 'ఏక్ దిన్' అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. 

మే 2026లో విడుదలైన ఈ చిత్రం, తెలుగులో 'ఒక రోజు' పేరుతో వచ్చింది. ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న ఈ సినిమా, తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, సాధారణంగా ఓటీటీలో సినిమా వస్తే అందరూ ఉత్సాహంగా చూస్తారు, కానీ 'ఏక్ దిన్' విషయంలో మాత్రం పెద్ద ట్విస్టు అందరికీ షాక్ ఇస్తుంది.

ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా కేవలం 'రెంటల్' పద్ధతిలో మాత్రమే చూసే అవకాశం ఉంది. ఇండియాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ కావడం లేదు. త్వరలోనే ఇండియన్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

థాయిలాండ్ సినిమా 'వన్ డే'కి ఇది అధికారిక రీమేక్ కావడం విశేషం. ఇది సాయి పల్లవికి మొదటి హిందీ సినిమా కాగా, అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. 

 

 

Sai Pallavi, Ek Din movie, Oka Roju film, OTT

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com