జానకమ్మ ఇంట్లో విషాదం.. ఒక్కగానొక్క కుమారుడు మృతి
on Jan 22, 2026

-తీవ్ర దుఃఖంలో జానకమ్మ అభిమానులు
-కుమారుడు మృతి
-మరణానికి గల కారణం ఏంటి!
భారతీయ సినీ సంగీత సాగరంలో ఉన్న అతి తక్కువ లెజండ్రీ గాయనిమణుల్లో ఎస్ జానకి(s Janaki)గారు ఒకరు. అభిమానులు, శ్రోతలు, ఇండస్ట్రీ వాళ్ళు జానకమ్మ అని పిలిచుకుంటు ఉంటారు. ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వేల కొద్దీ మధురమైన పాటలు ఆమె గాత్రం నుంచి వెలువడ్డాయి. అమృత తుల్యమైన ఆ పాటలు వింటు ఎంతో మంది తమ జీవితాలని ఆనందమయంగా మలుచుకున్నారు. అటువంటి జానకమ్మ ఇంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది.
జానకమ్మ కుమారుడు పేరు మురళీకృష్ణ(Murali Krishna). వయసు 65 సంవత్సరాలు. ఈ రోజు తెల్లవారు జామున అనారోగ్య కారణాలతో మురళి కృష్ణ తుది శ్వాస విడిచారు. మరణం విషయాన్నీ మరో లెజండ్రీ గాయనిమణి 'చిత్ర' గారు సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేయడం జరిగింది. ఆమె తన పోస్ట్ లో 'ఈ ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని షాకయ్యాను. మేము ఒక ప్రేమగల సోదరుడిని కోల్పోయాం. ఈ భరించలేని బాధని, దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించాలి. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ కూడా భావోద్వేగంగా రాసుకొచ్చారు.
Also read: వెంకీ గౌడ ఎంత అడిగాడు.. మీరు ఎంత ఇచ్చారు!
మురళి కృష్ణ భరతనాట్యంలో విశేష ప్రావీణ్యం కలిగి ఉండటంతో పాటు పలు చిత్రాల్లో కూడా కనపడి మెప్పించారు.భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు మురళి కృష్ణ మరణం పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. మురళి కృష్ణ కి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా జానకమ్మకి మురళి కృష్ణ ఒక్కగానొక్క కుమారుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



