Home

»

Latest News

ఆర్జీవీ సంచలన ట్వీట్.. విజయ్ తన పార్టీని నాశనం చేస్తాడని కరుణానిధి ఊహించి ఉండడు!

May 5, 2026 6:03PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు ఎప్పుడూ సంచలనమే. తాజాగా తమిళనాడు రాజకీయపై ఆయన చేసిన ఒక ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో, ఒక అరుదైన ఫొటోను షేర్ చేస్తూ ఆర్జీవీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం. కరుణానిధి వెనుక ఒకప్పుడు చిన్న కుర్రాడిగా విజయ్ నిలబడి ఉన్న ఫొటోను ఆర్జీవీ పోస్ట్ చేశారు. ఆ ఫొటోను ఉద్దేశిస్తూ.. “తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీని నాశనం చేస్తాడని కలైంగర్ (కరుణానిధి) కలలో కూడా ఊహించి ఉండడు” అని వర్మ ట్వీట్ చేశారు. 

తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి కుమారుడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీను విజయ్ ఓడించిన విషయం తెలిసిందే. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ తొలి ఎన్నికల్లోనే 108 సీట్లతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే విజయ్ గెలుపుని ఉద్దేశించి ఆర్జీవీ అలా ట్వీట్ చేశారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com