రవితేజ బర్త్ డే స్పెషల్: పదకొండేళ్ళ పాటు 'హిట్' ట్రాక్ రికార్డ్!
on Jan 26, 2022
మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే ఎన్నో జనరంజక చిత్రాలు కళ్ళముందు కదలాడతాయి. మరీముఖ్యంగా.. 2001 నుంచి 2011 వరకు రవితేజ కెరీర్ బెస్ట్ ఫేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ పిరియడ్ లో ప్రతీ క్యాలెండర్ ఇయర్ లోనూ కథానాయకుడిగా కనీసం ఒక్క హిట్ నైనా తన ఖాతాలో వేసుకుంటూ వచ్చి పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించారీ టాలెంటెడ్ స్టార్.
సంవత్సరాల వారీగా ఆ విజయాలను గుర్తు చేసుకుంటే.. 2001లో 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 2002లో `ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు`, `ఇడియట్`, `ఖడ్గం`, 2003లో `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`, 2004లో `వెంకీ`, 2005లో `భద్ర`, 2006లో `విక్రమార్కుడు`, 2007లో `దుబాయ్ శీను`, 2008లో 'కృష్ణ', 2009లో `కిక్`, 2010లో `డాన్ శీను`, 2011లో `మిరపకాయ్`.. ఇలా పదకొండేళ్ళపాటు ప్రతీ సంవత్సరం రవితేజ ఖాతాలో ఒకటీ లేదా అంతకుమించి విజయాలున్నాయి. 2000 సంవత్సరం తరువాత ఇలా పదకొండేళ్ళ పాటు ప్రతీ ఏడాది హిట్స్ చూసిన స్టార్ బహుశా మాస్ మహారాజా రవితేజ అనే చెప్పుకోవచ్చు. మరి.. భవిష్యత్ లోనూ ఇలాంటి `హిట్` ట్రాక్ రికార్డుని మరోమారు రవితేజ కొనసాగిస్తారేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
