టాలీవుడ్ హిస్టరీలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో రవితేజ నటించిన 'వెంకీ' ఒకటి. కేవలం కామెడీ మాత్రమే కాదు, సీరియస్ క్రైమ్ థ్రిల్లింగ్‌ను కూడా సమానంగా పండించవచ్చని ఈ సినిమా నిరూపించింది. తాజాగా ఈ చిత్రంలోని క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ నెట్టింట సందడి చేస్తోంది. జంట హత్యల కేసులో ఇరుక్కున్న వెంకీ అండ్ టీమ్, అసలు నిందితుడిని ఎలా పట్టుకున్నారనేది ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది.
జంట హత్యల వెనుక ఉన్న అసలు నిందితుడు శరత్ సక్సేనా ప్లాన్లను తిప్పికొట్టడానికి వెంకీ గ్యాంగ్ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. రాజ్ భవన్ చుట్టూ విలన్ల మనుషులు కాపు కాసినా, ఎవరికీ అనుమానం రాకుండా హోలీ రంగులు పూసుకుని రంగంలోకి దిగుతారు. గజదొంగల టీమ్ కూడా గుర్తుపట్టలేని విధంగా రంగుల మాటున రాజ్ భవన్ గేటు వరకు చేరుకోవడం ఈ సీన్‌లో అసలైన మలుపు.
ప్రధాన నిందితుడు పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడుతున్న సమయంలో, వెంకీ తన ప్రాణాలకు తెగించి పోరాడుతాడు. తన దగ్గర ఉన్న వీడియో క్యాసెట్‌ను గవర్నర్‌కు అందజేయడానికి స్నేహితుడు సూరిబాబును లోపలికి పంపి, బయట శత్రువులతో వీరోచితంగా పోరాడతాడు. రవితేజ మార్కు యాక్షన్, దానికి తోడు స్నేహానికి ఇచ్చే విలువ ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది.
తమపై పడిన హంతకుల ముద్రను తొలగించుకోవడమే కాకుండా, రాష్ట్రంలో కలకలం రేపిన కేసును ఛేదించినందుకు వెంకీ బృందానికి పోలీస్ అకాడమీలో ఘన సన్మానం జరుగుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేతుల మీదుగా విశిష్ట సేవా పథకాలు అందుకోవడం ఈ కథకు ఒక గర్వకారణమైన ముగింపును ఇస్తుంది. రవితేజ ఎనర్జీ, శ్రీను వైట్ల టేకింగ్ ఈ సినిమాను ఒక ఆల్ టైమ్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి. ఇలాంటి మరిన్ని యాక్షన్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.





