
పరాజయాలు నేర్పిన పాఠంతో మాస్ మహారాజా కొత్త నిర్ణయం
ఆ విషయంలో మనసు మార్చుకున్నాడా!
అందుకే భారీగా కోత విధించుకుంటున్నాడా!
ప్రెజెంట్ ఇరుముడిని ముస్తాబు చేస్తున్న మాస్ మహారాజా
మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం
'మాస్ మహారాజా' రవితేజ(Raviteja)కట్ అవుట్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోతే. కానీ కొంత కాలంగా రవితేజ నుంచి విజయవంతమైన చిత్రాలు రావడం లేదు. సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం పాస్ మార్కులతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఇరుముడి(irumudi)అనే మూవీ సెట్స్ పై ఉంది. మరిన్ని కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ పలనా నిర్ణయం తీసుకున్నాడనే న్యూస్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
రవితేజ ఒక్కో మూవీకి 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు,వరుస పరాజయాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తన పారితోషికాన్ని సగానికి తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తన రాబోయే ప్రాజెక్టుల కోసం 15 కోట్లు మాత్రమే చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. తన మార్కెట్ మళ్ళీ పుంజుకునే వరకు నిర్మాతలు సేఫ్ జోన్‌లో ఉండాలనే ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ ఈ న్యూస్ నిజమైతే కనుక రవితేజ తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తీరికెక్కించవచ్చు . బడ్జెట్ కూడా నియంత్రణలో ఉంటుంది.
also read: Rajinikanth: విజయ్ సిఎం కావడంపై రజినీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..సూపర్ గా చెప్పాడు
హీరోల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో, రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఇది కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయమే కాకుండా, ఇతర హీరోలకి కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రెజెంట్ రవితేజ చేస్తున్న ఇరుముడిపై ఫ్యాన్స్ , ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
.webp)




