
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు తమ దీక్షా కాలం ముగిసే సమయానికి ఇరుముడి(Irumudi)ని స్వీకరిస్తారు. ఆ ఇరుముడిలో ఎంత పవిత్రత, శక్తీ దాగి ఉందో మాస్ మహారాజ రవితేజ(Raviteja)అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి' మూవీ ద్వారా ఆర్డమవుతుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ తో ఇరుముడి టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి. పైగా ప్యూర్ పాజిటివ్ టాక్ రన్ అవుతూ వస్తుంది. షూట్ దశలో ఉన్నప్పటి నుంచే పాజిటివ్ బజ్ వస్తుండటం ఈ మధ్య కాలంలో కేవలం ఇరుముడి కే అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ తో సోషల్ మీడియా కూడా ఇరుముడి కోసం ఎదురుచూసే పరిస్థితి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తి అయ్యింది. దీంతో ఇంకా నెల రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. పైగా కీలకమైన షెడ్యూల్స్ ఇప్పటికే ముగిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని అనిల్ అరసు, రియల్ సతీష్ పర్యవేక్షణలో చిత్రీకరించారు. సదరు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఫ్రెష్‌గా ఉండబోతున్నాయని టాక్.
Also read: Ameesha Patel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. ఆ 100 కోట్లుకి వాల్యూ లేదు
'ఇరుముడి' కేవలం ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న సినిమా మాత్రమే కాదు. బలమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి. రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర చేస్తుండగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా చేస్తుంది. అయ్యప్ప స్వామి భక్తుడు తన జీవితంలో ఎదురైన పరిస్థితులు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారనేది కథాంశంగా ఉండబోతోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తుండగా పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.






