Home

»

Latest News

రష్మిక షాకింగ్ కామెంట్స్: విజయ్ కోసం వెయ్యిసార్లయినా అదే చేస్తా.!

Oct 26, 2026 3:02PM

రష్మిక మందన్న.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవడానికి తాను ఏడాది పాటు ప్రయత్నించానని, వందసార్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చానని ఆమె చెప్పిన మాటలు పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం రష్మికను అవమానించేలా విజయ్ మాట్లాడారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో తాజాగా రష్మిక రంగంలోకి దిగి, తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి ప్రస్తావన మొదట తానే తీసుకొచ్చానని, ఏడాది పాటు వందసార్లు పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నానని రష్మిక చెప్పుకొచ్చింది. 

ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రష్మికనే ఎక్కువగా ప్రేమిస్తోందని, విజయ్ ఆమెకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కొందరు విమర్శలు చేశారు. 

తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన రష్మిక.. తమ ప్రేమను ఇతరులు ఎలా అర్థం చేసుకున్నా, తమకు మాత్రం తమ బంధంపై స్పష్టత ఉందని తెలిపింది. పెళ్లి అనేది మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయడం, ఉంగరం పెట్టడం మాత్రమే కాదని.. ఇద్దరూ కలిసి జీవితాన్ని నిర్మించుకోవడమే అసలైన అర్థమని చెప్పింది.

తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నామని, చివరికి ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. విజయ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయితే.. తాను మనసుతో ఆలోచించే వ్యక్తినని, ఈ విషయంలో ఇద్దరి స్వభావాలు తమ బంధానికి బలంగా నిలిచాయని వివరించింది.

ఇక వందసార్లు పెళ్లి గురించి అడిగిన విషయంపై స్పందిస్తూ.. “నేను వెయ్యిసార్లయినా అదే చేస్తాను. వందసార్లు అనేది పెద్ద విషయమే కాదు” అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించింది. విజయ్‌పై తనకున్న ప్రేమను బయటపెట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. తన జీవిత భాగస్వామిపై ప్రేమను వ్యక్తపరచడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.

తమ బంధం గురించి మాట్లాడేవారికి రష్మిక మరో విషయాన్ని గుర్తుచేసింది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు తనకు తోడుగా నిలిచింది విజయ్ అని చెప్పింది. తాను బాధలో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచిన వ్యక్తి గురించి బయటివారు చేసే వ్యాఖ్యలు తమ బంధాన్ని మార్చలేవని స్పష్టం చేసింది.

తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని, తన ముఖంలోనూ, సినిమాల్లోనూ ఆ ఆనందం కనిపిస్తోందని చెప్పుకొచ్చింది. తమ జీవితాన్ని తాము కోరుకున్న విధంగా నిర్మించుకున్నామని తెలిపింది.

అదే సమయంలో తన కుటుంబం గురించి తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని ట్రోలర్స్‌కు హితవు పలికింది. తనను ఎంత విమర్శించినా భరిస్తానని, కానీ తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని మాత్రం అంగీకరించనని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: సూర్యకు హ్యాట్రిక్ ఛాన్స్..‘సీన్’తో హిస్టరీ క్రియేట్ చేస్తారా.?

 

 

 

[Rashmika Marriage Proposal, Rashmika Trolls, Rashmika Mandanna, Vijay Deverakonda, Rashmika Twitter, Koffee With Karan 9, Ranabaali, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com