Home

»

Latest News

Rashmika mandanna: ఆ లెజండ్రీ బయోపిక్ లో రష్మిక... అల్లు అరవింద్ చాణిక్యం ఫలిస్తుందా!

Jun 8, 2026 11:14AM

 

భారతీయ సంగీతమే తనని తాను పరిచయం చేసుకోవాలంటే గానకోకిల, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి(Rashmika Mandanna)పేరు చెప్తుంది. అంతలా సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన సంగీత సరస్వతి. యావత్ ప్రపంచవ్యాప్తంగా తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలలో అమరజీవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించిన సుబ్బలక్ష్మిగారి  జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ని ప్రెస్టేజియస్ట్ బ్యానర్   గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో  'జెర్సీ' వంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ మూవీ  దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. మొదట ఈ క్యారక్టర్ కోసం  సాయి పల్లవి, ఆ తర్వాత కన్నడ నటి రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందనే  టాక్ నడుస్తోంది.


రష్మిక(Rashmika Mandanna)ని ఎంపిక చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రష్మిక కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ అంతటా తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతోంది. ఈ ఏడాది జూన్ 19, 2026 న విడుదల కానున్న 'కాక్‌టెయిల్ 2' చిత్రంలో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటిస్తూ బాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి పాన్-ఇండియా క్రేజ్ ఉన్న నటి ఈ క్లాసికల్ బయోపిక్‌లో నటిస్తే, వ్యాపారపరంగా,ప్రేక్షకాదరణ పరంగా బయోపిక్ కి  భారీ మైలేజ్ లభిస్తుందని  గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ భావిస్తోందట.

సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉండటంతో, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చబోతున్నారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవితంలో 1966లో ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇవ్వడం ఒక మైలురాయి. కార్నెగీ హాల్, రాయల్ ఆల్బర్ట్ హాల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వేదికలపై పాడి, 1974లో రామన్ మెగసేసే అవార్డు అందుకున్న మొదటి భారతీయ సంగీత విద్వాంసురాలిగా నిలిచారు. ఆ తర్వాత 1998లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ని  అందుకున్నారు. . ఇంతటి మహోన్నతమైన గాయని రోల్ లో రష్మిక చెయ్యడం గాయమైతే  తన నటనతో ఎలా మెప్పిస్తుందనేది  ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 

Also read: janhvi kapoor: తెలుగులో మళ్ళీ అవకాశాలు వస్తాయా! అసలు చేస్తుందా!

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి సంగీత ప్రస్థానం కేవలం ఒక కళాకారిణి ప్రయాణం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన చరిత్ర. 1926లో కేవలం 10 సంవత్సరాల వయసులోనే "మరగత వడివు" అనే తమిళ పాటతో తన అద్భుతమైన కెరీర్‌ని  ప్రారంభించిన సుబ్బలక్ష్మి గారు, ఏకంగా ఏడు దశాబ్దాల పాటు తన గానంతో సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షిక సదస్సులో పాడిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 72 రాగాల సమ్మేళనంతో సాగే అత్యంత క్లిష్టమైన 'మేళరాగమాలిక' వంటి కూర్పులని  అలవోకగా ఆలపించి  మంత్రముగ్ధులని  చేశారు. 2004లో తన 88వ ఏట సుబ్బలక్ష్మి గారు కేవలం తన పార్థివ దేహాన్ని మాత్రమే విడిచి స్వర్గస్థులయ్యారు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com