
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల మధ్య నెంబర్ వన్ స్థానం కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీ నెలకొంటుంది. బాక్సాఫీస్ రికార్డులు, నటనకు ప్రశంసలతో పాటు ఒక సినిమాకు వారు తీసుకునే పారితోషికం ఆధారంగా ఇండస్ట్రీలో వారి స్థానం ఏంటో లెక్కగడుతుంటారు.
గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సరికొత్త రికార్డులతో అగ్రస్థానంలో కొనసాగారు. సాధారణంగా ఆమె ఒక్కో సినిమాకు 9 కోట్ల రూపాయల నుండి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు.
అయితే, 2026 నాటికి సౌత్ చిత్ర పరిశ్రమలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నయనతార రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డుతో సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నెంబర్ 1 నటిగా అవతరించింది.
సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం, రష్మిక మందన్న త్వరలో రాబోతున్న బాలీవుడ్ హిందీ చిత్రం 'కాక్‌టైల్ 2' కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని అందుకుంది. ఈ వార్త గనుక నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక దక్షిణ భారత నటి అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే కావడం విశేషం.
రష్మిక మార్కెట్ వాల్యూ ఈ రేంజ్‌లో పెరగడానికి కారణం ఆమె ఖాతాలో ఉన్న వరుస బాక్సాఫీస్ విజయాలే. 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావా' చిత్రాల విజయాల తర్వాత ఆమె దేశంలోనే అత్యంత క్రేజీ స్టార్‌గా ఎదిగింది. పుష్ప మొదటి భాగం కోసం రష్మిక కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే పారితోషికం తీసుకుంది. కానీ, కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఆమె ఏకంగా 15 కోట్ల రూపాయల స్థాయికి చేరుకోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.





.webp)
