
పెళ్ళి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మొదటి సినిమా 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్, రిలీజ్ డేట్‌కి సంబంధించి ఆడియన్స్‌లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. దానికి కారణం రష్మికకి అయిన తీవ్ర గాయమే. 'మైసా' షూటింగ్ సమయంలో రష్మిక టెండన్ ఇంజ్యూరీ వల్ల బెడ్ రెస్ట్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అభిమానులందరూ అసలు 'రణబాలి' ప్లాన్ ప్రకారం అనుకున్న డేట్‌కి వస్తుందా? లేదా అని చాలా ఆందోళన చెందారు.
తాజాగా సమాచారం ప్రకారం.. రష్మిక వేగంగా రికవరీ అవుతున్నారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. పనులు మళ్లీ వేగవంతం కావడంతో, మేకర్స్ ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌ను దసరా హంగామా ముగిశాక, అక్టోబర్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రీవియస్‌గా సెప్టెంబర్ 11న అనుకున్నప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని... అలాగే రష్మిక సంపూర్ణంగా కోలుకున్నాకే చివరి షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేయాలని మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
'ది మమ్మీ' ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో మెయిన్ విలన్ సార్ థియోడోర్ హెక్టర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. అజయ్-అతుల్ అందించే సంగీతం, నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కానున్నాయి. బ్రిటీష్ కాలం నాటి చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ విజువల్ వండర్ అక్టోబర్ 30న థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
Ranabaali, Vijay Deverakonda, Rashmika Mandanna






