Home

»

Latest News

Ramba Oorvasi Menaka Movie Review Telugu: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ 

Sep 4, 2026 1:50PM

 


సినిమా పేరు: రంభ, ఊర్వశి, మేనక
న‌టీన‌టులు: అల్లరి నరేష్, సురభి, నరేష్, రాశి సింగ్, ప్రిష సింగ్,  విష్ణు ప్రియ, వెన్నెల కిషోర్, తారక్ పొన్నప్ప, శ్రీనివాసరెడ్డి, గోపరాజు రమణ తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: పవన్ పప్పుల
ఎడిటింగ్: చోట కె ప్రసాద్ 
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ 
నిర్మాత‌లు : రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్  
బ్యానర్ :  హాస్య క్రియేషన్స్,
రచన,దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ  
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026  

 కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఈ రోజు రంభ, ఊర్వశి, మేనక అంటూ థియేటర్స్ లో  అడుగుపెట్టాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగస్వామి కావడం  రంభ, ఊర్వశి, మేనక స్పెషాలిటీ. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి( అల్లరి నరేష్) వంశపారంపర్యంగా వస్తున్న డ్రామా కంపెనీకి ప్రస్తుత ఓనర్. చిన్న తనంలోనే తన తల్లితో పెద్ద సినిమాహీరో అవుతానని మాట ఇస్తాడు. కానీ తన డ్రామా కంపెనీ తరుపున ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు హీరో ప్రయత్నాలు చేయకండా ఊరి నిండా అప్పులు చేస్తాడు. చిన్నతనం నుంచే పైన ఆకాశంలో స్వర్గలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక లని తన ఆరాధ్య దైవాలుగా భావిస్తు ఆ ముగ్గురిని భూమ్మీదకి రప్పించడం కోసం పూజలు చేస్తుంటాడు. దీంతో సూరిని స్వర్గలోకాధిపతి ఇంద్రుడు( వెన్నెల కిషోర్) తన ఎనిమీ గా భావించి రంభ, ఊర్వశి, మేనక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇంద్రుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? దానివల్ల సూరి లైఫ్ ఏ విధంగా కొనసాగింది? ఎండ్ అయ్యింది? అనేదే రంభ, ఊర్వశి మేనక.

ఎనాలసిస్ 

మూవీ చూస్తున్నంత సేపు పది, పదిహేనేళ్ల క్రితం రావాల్సిన కథ, కథనం కదా అనిపిస్తుంటుంది. సీన్స్ కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. మూవీ చివరలో హీరో తన లైఫ్ గురించి మోటివేట్ అవ్వడం అనేది ఇంటర్వెల్ బ్లాంగ్ గా ఎంచుకొని హీరో అవ్వడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేసాడని చెప్పి ఉంటే మానవ శక్తీ ముందు దైవ శక్తీ సైడ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉన్నా మూవీ ఫలితం వేరేలా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ఏ ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకోదు. సూరితో పాటు తన ప్రేయసి( సురభి) మధ్య వచ్చిన సీన్స్ ,పోలీస్ ఇన్ స్పెక్టర్ ( తారక్ పొన్నప్ప) తో  వచ్చిన సీన్స్  సైతం ఆకట్టుకోలేదు.

ఇంద్రుడుగా వచ్చిన వెన్నెల కిషోర్ సీన్స్ కొంచం పర్లేదు. ఇంటర్వెల్ బాంగ్ పర్లేదు. సెకండ్ హాఫ్ లో  సీనియర్ నరేష్, శ్రీనివాసరెడ్డి తో వచ్చిన కామెడీ సీన్స్ పర్లేదు. రంభ, ఊర్వశి, మేనక ని ముట్టుకుంటే చనిపోతారని వచ్చిన సీన్స్ నవ్వు పుట్టించలేదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో పాటు సూరి క్యారక్టర్ ద్వారా చెప్పిన మెసేజ్ బాగున్నా తల్లి చనిపోకుండా సూరినే  కాపాడుకోవాల్సింది.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

సూరిగా అల్లరి నరేష్ ఎప్పటి లాగానే  కామెడీ, లవ్, సెంటిమెంట్ మోడ్ లో మెస్మరైజ్ చేసాడు. ముఖ్యంగా హాస్పిటల్ లో  తల్లితో వచ్చిన సీన్స్ లో కన్నీళ్లు పెట్టించాడని చెప్పవచ్చు.  సురభితో పాటు  రంభ, ఊర్వశి, మేనక గా చేసిన  రాశి సింగ్, ప్రిష సింగ్,  విష్ణు ప్రియ నటనలో మెరుపులు లేకపోయినా సెల్యులాయిడ్ పై అందంగా మెరిశారు. నరేష్ మరో సారి తన పెర్ఫార్మ్ తో మెప్పించాడు. వెన్నెల కిషోర్ తో పాటు మిగతా ఆర్టిస్టులందరు తమ క్యారక్టర్ కి న్యాయం చేసారు. పోలీస్ క్యారక్టర్ కి  తారక్ పొన్నప్ప సూట్ అవ్వలేదు.  దర్శకుడు చంద్రమోహన్  స్క్రీన్ ప్లే, కథ విషయంలో ఓల్డ్ ఫార్మేట్ ని నమ్ముకున్నాడు.ఏ ఒక్క సన్నివేశాన్ని కొత్తగా మలచలేకపోయాడు. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగానే పేలినా, కామెడీ ని పుట్టించడమే లక్ష్యంగా ఉపయోగించే  అలాంటి డైలాగ్స్ నిత్యం వింటూనే ఉంటున్నాం. హైదరాబాద్ లోని మణికొండ ఏరియాపై పంచ్ వచ్చేలా డైలాగ్ చెప్తే  రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రేక్షకులకి ఆ జోక్ అర్ధం కాదు కదా! నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.  సాంగ్స్ కూడా ఓల్డ్ వెర్షన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు.

బలాలు
1 . అల్లరి నరేష్ పెర్ ఫార్మెన్స్ 
2 . ప్రీ క్లైమాక్స్ 

బలహీనతలు 
1 . కథ
2 . కథనం

చివరిగా చెప్పుకోవాలంటే రంభ, ఊర్వశి, మేనక విజయానికి ఓల్డ్ ఫార్మేట్ లో ట్రావెల్  చేసిన కథ, కథనం, దర్శకత్వం అడ్డుగా నిలిచాయి.

 


       రేటింగ్ 2 /5                                                                            అరుణాచలం
                                                                                                                                         
         

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com