Home

»

Latest News

రామాయణకి షాక్: ఆ మూవీతో పోటీ తప్పదా.. స్క్రీన్స్ విషయంలో అన్యాయం!

Sep 9, 2026 4:00PM

 


వరల్డ్ వైడ్ గా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు, రామభక్తులు నవంబర్ 6 న విడుదల కానున్న 'రామాయణ పార్ట్ 1 ' కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు  రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా కనిపించడం రామాయణకి ఉన్న మరో స్పెషాలిటీ..

అయితే జపాన్‌కి  చెందిన ఆస్కార్ విజేత ఫ్రాంచైజీ మూవీ 'గాడ్జిల్లా మైనస్ వన్' సీక్వెల్‌గా వస్తున్న 'గాడ్జిల్లా మైనస్ జీరో'  కూడా నవంబర్ 6,నే గ్లోబల్ వైడ్ గా  థియేటర్లలోకి అడుగుపెడుతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణ థియేటర్లలో రెండు సినిమాలకూ తగినన్ని స్క్రీన్లు లభించినప్పటికీ, నార్త్ అమెరికా,ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో ఐమాక్స్ (IMAX) స్క్రీన్ల కేటాయింపు ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. ఐమాక్స్ ప్రొడక్షన్‌గా వస్తున్న గాడ్జిల్లాకు ఓవర్సీస్ మార్కెట్లలో ప్రీమియం ఫార్మాట్లలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉండటంతో రామాయణ మేకర్స్‌కు ఇది ఊహించని షాక్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  అయితే భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్లాన్ చేస్తున్న రామాయణ బృందం మాత్రం ఈ పోటీపై ఎంతో ధీమాగా ఉంది. ఈ చిత్ర అంతర్జాతీయ పంపిణీ హక్కులను గ్లోబల్ జెయింట్ సోనీ పిక్చర్స్ (Sony Pictures) సొంతం చేసుకోవడంతో నార్త్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ప్రీమియం ఐమాక్స్ స్క్రీన్లు దక్కుతాయని ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా  నమ్మకంతో ఉన్నారు.

 

  


Also Read: మళ్ళీ మీ ముందుకు పిచ్చెక్కించే బోల్డ్, రొమాంటిక్ పార్ట్ 3 : కోరికలే గుర్రాలైతే!


గాడ్జిల్లా మైనస్ జీరో విషయానికి వస్తే   దర్శకుడు తకాషి యమజాకి తెరకెక్కిస్తుండగా  గ్లోబల్ మార్కెట్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని జపాన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేసిన ప్రత్యేక చిత్రంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గాడ్జిల్లా ట్రైలర్‌లోని విజువల్స్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ డిజైన్ అందుకు తగ్గట్టుగా ఉన్నాయి. మరి నవంబర్ 6, న జరగబోయే ఈ రెండు భారీ విజువల్ వండర్స్ మధ్య పోరు అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

 

 

[Ramayana, Godzilla Minus Zero, Imax Clash, Ranbir Kapoor, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com