Home

»

Latest News

Ram Pothineni: రామ్ పోతినేని లవ్ ట్రాక్.. హీరోయిన్ ఇచ్చిన ట్విస్ట్‌కి హీరోకి పిచ్చెక్కిపోయింది!

May 16, 2026

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) సినిమాల్లో లవ్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలిసిందే. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే లవ్ ట్రాక్స్, హీరోల కన్ఫ్యూజన్ డ్రామాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ పోతినేని సూపర్ హిట్ సినిమా 'మస్కా'లోని హైలైట్ సీన్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఈ కథలో హీరో ఇద్దరు అమ్మాయిల మధ్య నడిపిన లవ్ అండ్ డబుల్ గేమ్, ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి హీరోకు ఇచ్చిన అదిరిపోయే రివర్స్ ట్విస్ట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లవర్స్ మధ్య క్లారిటీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ సీన్ చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా చూపిస్తుంది.

కథలోకి వెళితే.. హీరో ఒకే సమయంలో మంజు (షీలా) , మీను (హన్సిక)  అనే ఇద్దరు అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడుపుతూ కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఈ గందరగోళంలో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కలుసుకుని, హీరో ఆడుతున్న డబుల్ గేమ్ మొత్తాన్ని కనిపెట్టేస్తారు. ఆఫీసులో హీరో జాతకం బయటపడటంతో మంజు, మీను ఇద్దరూ ఒకటైపోతారు. హీరో తన ఫ్రెండ్‌ సునీల్ తో కలిసి పబ్ కి వచ్చి మేనేజ్ చేద్దామని చూసేసరికి, అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. తప్పు కప్పిపుచ్చుకోవడానికి హీరో చెప్పే కథలు విని హీరోయిన్ మీను తీవ్ర ఆగ్రహానికి గురవుతుంది. తన కళ్లు ప్రతిరోజూ నీలాంటి మోసగాడి కోసమే ఎదురుచూశాయా అంటూ గట్టిగా నిలదీస్తుంది. అంతటితో ఆగకుండా, "ఇకపై నేను నీకు ఇలాగే గుర్తుండాలి" అని చెబుతూ అందరి ముందూ హీరో చెంప చెల్లుమనిపిస్తుంది. 

ఇక మంజు అయితే.. నేను చంపదెబ్బలతో వదిలిపెట్టనని, బాంబులతో లేపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. హీరోయిన్ ఇచ్చిన ఈ ఊహించని షాక్‌కి హీరోకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. భయంతో వణికిపోతూ తనను క్షమించమని మంజు చుట్టూ తిరగడం మొదలుపెడతాడు. ఆ తర్వాత మంజు ఒక పని చేయాలని చెప్పడంతో.. నువ్వు ఏమడిగినా చేస్తానని హీరో మాట ఇస్తాడు. 

అయితే అప్పటికే మంజుకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైపోతుంది. తన ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో ఆ నిశ్చితార్థ వేడుకకు మాస్ ఎంట్రీ ఇస్తాడు.ముహూర్తానికి సరిగ్గా పది నిమిషాల సమయం ఉందనగా పెళ్లి మండపంలోకి దూసుకొచ్చిన హీరో, అక్కడ ఉన్న రౌడీలను, పెళ్లి పెద్దలను తనదైన శైలిలో ఫూల్ చేస్తాడు. వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో స్వయంవరం ఎలా జరిగేదో వివరిస్తూ ఒక పెద్ద డ్రామా ప్లే చేస్తాడు. చేతిలో కత్తి పట్టుకుని గాలిలో పండ్లను నరుకుతూ, పాతకాలపు వీరుడిలా యాక్షన్ చూపిస్తూ పెళ్లి కూతురు తండ్రిని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. బలవంతంగా చేసే పెళ్లిళ్లు నిలవవని, మంజు మనసులో ఉన్నది తానేనని నిరూపించి అడ్డువచ్చిన వారందరినీ చితక్కొడతాడు. 

రామ్ పోతినేని మార్క్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, హీరోయిన్ ఇచ్చిన పవర్‌ఫుల్ ట్విస్ట్ ఈ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

మరిన్ని అద్భుతమైన సన్నివేశాలు, సినిమాల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com