దటీజ్ రామ్ గోపాల్ వర్మ..బాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు
on Feb 12, 2025
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopalvarma)కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు నా గత చరిత్రని మర్చిపోయి ఇన్ని రోజులు సిగ్గుతో తలదించుకునే సినిమాలు చేశాను.ఇక నుంచి మంచి సినిమాలు తెరకెక్కిస్తాను.సినిమా అనేది చాలా గొప్పది.సినిమా రుణం తీర్చుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.
వర్మ లేటెస్ట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో ఆయన బాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల గురించి మాట్లాడుతు ఇటీవల కొత్త రకం దర్శకులు వచ్చారు.వాళ్ళు 'బాంద్రా' లాంటి ఖరీదైన ఏరియాలో ఉంటు విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తు,ఆ తరహా చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు.ఆ విధంగా నెమ్మదిగా అదే మేకింగ్ స్టైల్ లోకి బాలీవుడ్ మారిపోయింది.దాంతో మాస్ ఎంటర్ టైనర్ సినిమాలని ప్రేక్షకులకి అందించాలనే విషయాన్నీ బాలీవుడ్ మర్చిపోయింది.పుష్ప 2(Pushpa 2)లాంటి సినిమాలని తెరకెక్కించే సామర్ధ్యం బాలీవుడ్ కి ఉన్నా కూడా వాళ్ళు ఆ దిశగా ఆలోచించటం లేదు.
కానీ సౌత్ ఇండస్ట్రీ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.ఇక్కడి వారు సంసృతి సంప్రదాయాలకి అనుగుణంగా చిత్రాలని తెరకెక్కిస్తూ మాస్ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నారు,అందుకే విజయాల శాతం ఎక్కువ ఉందని చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
