రామ్ చరణ్ సీక్రెట్ బయటపడింది..!
on Jan 17, 2025
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం నాలుగో సీజన్ జరుగుతోంది. ఈ సీజన్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ (Ram Charan) సందడి చేశాడు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన రెండో భాగం విడుదలైంది. దీనిలో రామ్ చరణ్ సీక్రెట్ నేమ్ రివీల్ అయింది.
శర్వానంద్ తో కలిసి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న రామ్ చరణ్.. తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నాడు. అలాగే ఈ షోలో చరణ్ కి సంబంధించిన పలు విషయాలు రివీల్ అయ్యాయి. షోలో ఫోన్ లో మాట్లాడిన చరణ్ సోదరి సుస్మిత.. "రామ్ చరణ్ కి జాసూస్ అనే సీక్రెట్ నేమ్ ఉంది. అతనికి అన్నీ తెలిసిపోతుంటాయి. అందుకే మేము అలా పిలుస్తుంటాం." అని తెలిపింది. జాసూస్ అంటే స్పై అని అర్థం.
ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ (Prabhas) పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని బాలకృష్ణ అడగగా.. "నాకు మతిపరుపు సార్. మర్చిపోయాను" అని తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు చరణ్. అయినా బాలయ్య వదలకుండా ప్రభాస్ కి ఫోన్ చేసి "గణపవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని చరణ్ చెప్పాడు." అంటూ సరదాగా ఇరికించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రభాస్, ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలీదు అంటూ నవ్వులు పూయించాడు.
ఇక ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై కూడా చరణ్ స్పందించాడు. అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని, అది త్వరలోనే జరుగుతుందని చరణ్ అన్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
