ఫ్రెండ్ కోసం సుకుమార్ ని రామ్ చరణ్ ఆపుతున్నాడా! ఫ్యాన్స్ ఏమంటారో మరి
on Apr 23, 2025
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ 'బుచ్చిబాబు'(Buchibabu)దర్శకుడు. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన రామ్ చరణ్ లుక్, టీజర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'పెద్ది'పై అంచనాలు పెరిగాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ పలు రకాల క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఈ విషయం టీజర్ లో చరణ్ చెప్పిన డైలాగుల ద్వారా అర్థమైపోతుంది. మార్చి 27 2026 న చరణ్ బర్త్ డే సందర్భంగా పాన్ ఇండియా లెవల్లో 'పెద్ది' థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.
ఇక ఈ మూవీ తర్వాత చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్(Sukumar)దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో 'రంగస్థలం' కాంబినేషన్ రిపీట్ కావడం, పుష్ప 2 తో పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ క్రేజ్ తెచ్చుకోవడంతో, ఆ ఇద్దరి కాంబోలో వచ్చే కథపై మరింత ఆసక్తి నెలకొని ఉంది. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ కాంబో మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. సుకుమార్ కంటే ముందు చరణ్ మరో మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉందని, దీంతో మూవీని స్టార్ట్ చెయ్యడానికి సుకుమార్ మరికొంత సమయం తీసుకోనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే చరణ్ పెద్ది కంప్లీట్ అయిన వెంటనే మరో మూవీని ప్లాన్ చేయాలని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (uv Creations)నిర్మించబోతుందనే టాక్ కూడా బాగానే వినిపిస్తుంది. నిజానికి చరణ్,యువి బ్యానర్ లో గతంలోనే సినిమా రావాల్సి ఉంది. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ కింగ్ డమ్ కథని ఫస్ట్ చరణ్ కి గౌతమ్ చెప్పాడని, యువి నే ఆ చిత్రాన్ని నిర్మించాల్సి ఉందనే వార్తలు బాగానే వినిపించాయి. యువి ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi)తో విశ్వంభర చేస్తుంది. ఈ మూవీ తర్వాత చరణ్ మూవీనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. యువి అధినేతల్లో ఒకరైన వంశీ రెడ్డి, చరణ్ క్లాస్ మేట్స్ తో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ .

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
