రాజకీయం ఇంకా అయిపోలేదు..విజయ్ దర్శకుడితో రజనీకాంత్ మంతనాలు!
on Jun 23, 2025
వరుస ప్లాపులతో సతమవుతున్న సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)'జైలర్' తో హిట్ ట్రాక్ లో వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది 'వేట్టయ్యన్' తో అలరించిన రజనీ ప్రస్తుతం 'లోకేష్ కనగరాజ్' దర్శకత్వంలో చేస్తున్న 'కూలీ' మూవీతో బిజీగా ఉన్నాడు. కింగ్ 'అక్కినేని నాగార్జున' కూడా కీలక పాత్రలో చేస్తుండటంతో, సౌత్ చిత్ర పరిశ్రమలోనే క్రేజీ మల్టీస్టారర్ గా 'కూలీ' ప్రత్యేకతని సంతరించుకుంది. రజనీ ఈ మూవీ తర్వాత జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'జైలర్ 2 ' ని చెయ్యబోతున్నాడు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది.
'జైలర్ 2 ' తర్వాత రజనీ తన తదుపరి చిత్రాన్ని 'హెచ్ వినోద్'(H Vinoth)దర్శకత్వంలో చేయబోతున్నాడని, వినోద్ ఇటీవల రజనీని కలిసి రాజకీయ నేపధ్యంతో కూడిన ఒక కథ చెప్పాడని, ఆ కథ రజినీకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు తమిళ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే వినోద్, రజనీ రెండు సార్లు ఆ కథ పై కలిసారని, త్వరలోనే ఆ ఇద్దరి కాంబోపై అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
హెచ్ వినోద్ ప్రస్తుతం 'ఇళయ దళపతి విజయ్'(vijay)మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'జననయగాన్'(Jana nayagan)ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో రజనీ, వినోద్ కాంబోలో ప్రాజెక్ట్ తెరకెక్కితే ఆ మూవీకి వచ్చే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
