
అగ్ర నిర్మాత ఆర్ బి చౌదరి(Rb Choudary)రోడ్ యాక్సిడెంట్ లో ఆకస్మిక మరణానికి గురవ్వడం ప్రతి ఒక్కర్ని ఎంతగానో కలిచి వేస్తుంది. ఈ రోజు ఉదయం ఆర్ బి చౌదరి పార్థివ దేహాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ సందర్శించి తన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌదరి గారితో తనకున్న అనుబంధాన్ని రజినీ కాంత్(Rajini Kanth)గుర్తు చేసుకున్నారు.
రజినీ మాట్లాడుతూ నేను చౌదరి గారి బ్యానర్ లో చేయకపోయినా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.అప్పుడపుడు కలుసుకునే వాళ్ళం. నాలుగు నెలల క్రితం జైలర్ 2 షూటింగ్ సెట్స్ కి వచ్చి కలిశారు. నాతో మాట్లాడుతూ 99 వ సినిమా చేస్తున్నాను. 100 వ సినిమా చేసి రిటైర్ అవుతా. ఆ సినిమాలో నన్ను చెయ్యాలని అన్నారు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చానని రజినీకాంత్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ మాటలు చౌదరి గారి అభిమానులని బాధాసప్తంలో ముంచుతున్నాయి.
also read: Laila: లైలా పట్టుబట్టారు.. 22 ఏళ్ళ తర్వాత అదృష్టవంతులుగా తెలుగు ప్రేక్షకులు






