రాజ్ మొదటి భార్య శ్యామాలి కీలక నిర్ణయం.. విశ్వంతో జవాబు
on Dec 2, 2025

-ఏం ఉంది అందులో
-విశ్వం తో పోస్ట్
-హింట్ ఇచ్చిన అర్ధం చేసుకోలేకపోయారు
మనతో రుణం ఉన్నంతవరకే బంధాలన్నీ మనతో ఉంటాయి. రుణం తీరిన తర్వాత ఆ బంధం శాశ్వతంగా దూరం అవుతుంది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు. పైన చెప్పిన వ్యాఖ్యలన్ని ప్రముఖ దర్శకుడు రాజ్ మొదటి భార్య శ్యామాలి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ లు. ఆమె తన పోస్ట్ ల ద్వారా రాజ్(Raj),సమంత(Samantha)పెళ్లి చేసుకోబోతున్నారనే హింట్ ఇచ్చినా ఎవరు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. రీసెంట్ గా శ్యామాలి ఎక్స్ వేదికగా మరో పోస్ట్ షేర్ చేసింది.
సదరు పోస్ట్ లో 'ఈ అనంత విశ్వంలో మనం ఒక మూలన ఉన్నాం' అనే వ్యాఖ్యని జోడించడంతో పాటు విశ్వం యొక్క ఇమేజ్ ని షేర్ చేసింది. నిన్ననే రాజ్, సమంత వివాహం జరిగి ఉండటంతో శ్యామాలి చేసిన ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ముంబై యూనివర్సిటీ నుంచి సైకాలజీ లో డిగ్రీ పట్టా పొందిన శ్యామాలి, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ సమయంలోనే రాజ్ పరిచయమయ్యాడు.
also read: పెళ్ళిలో సమంత తొడిగిన డైమండ్ రింగ్ ఎక్కడిదో తెలుసా
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరు వైపుల పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2015 లో వివాహం జరగగా వారివురుకి ఒక పాప. కానీ మనస్పర్థలు తలెత్తడంతో 2022 లో విడాకులు తీసుకున్నారు. శ్యామలీ స్వస్థలం ముంబై(Mumbai)కాగా రాజ్ స్వస్థలం తిరుపతి.(Tirupati)

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



