
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ, దీపికా పదుకునే ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రాకా' గురించి రోజుకొక క్రేజీ న్యూస్ రాకపోతే సోషల్ మీడియా మారాం చేసే పరిస్థితి. అందుకే అభిమానులు నిత్యం సోషల్ మీడియాని జో కొడుతు రికార్డు వ్యూస్ ని కట్టబెడుతున్నారు. ఈ కోవలోనే రీసెంట్ గా 'రాకా' గురించి వస్తున్న వైరల్ న్యూస్ సోషల్ మీడియా ఆధిపత్యాన్ని చాటి చెప్తుంది.
మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్ ,జాన్వీ కపూర్, రష్మిక వంటి టాప్ హీరోయిన్స్ రాకాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి ఐశ్వర్య లక్ష్మి వచ్చి చేరింది. ఫిల్మ్‌వర్గాల్లో ప్రచారం జరుగుతున్న వార్తల ప్రకారం ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో సాధారణ రోల్ లో కాకుండా పవర్‌ఫుల్ లేడీ విలన్ రోల్‌లో కనిపిస్తుందని రూమర్. క్ఒకవేళ ఈ రూమర్ నిజమైతే, ‘రాకా’ చిత్రంలో మొత్తం ఐదుగురు ప్రముఖ నటీమణులు నటిస్తున్నట్లవుతుంది. ఒకే సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లను భాగం చేస్తూ అట్లీ అసలు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారనేది ఇప్పుడు సినీ ప్రియుల్లో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రతీ ఒక్కరి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా అట్లీ అత్యంత ఆసక్తికరంగా కథని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ముంబైతో పాటు వివిధ ప్రదేశాల్లో భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్, భారీ సైంటిఫిక్ సెట్లను నిర్మిస్తున్నారు.
Also Read: NBK 111 టైటిల్ ఒక రేంజ్ లో ఉంది! ఫ్యాన్స్ లో జోష్
ఇటీవల నటి మంచు లక్ష్మి షూటింగ్ సెట్‌ను సందర్శించి అక్కడి వింత జీవులు, అద్భుతమైన నిర్మాణాలు చూసి తాను ఫిదా అయ్యానని, బన్నీని మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో చూస్తారని సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక వైపు విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్, మరోవైపు ఐదుగురు లేడీ ఆర్టిస్టుల ప్రాధాన్యతతో కూడిన కథనంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతోందో వేచి చూడాలి. ఇక ఐశ్వర్య లక్ష్మి ఉందనే వార్తలతో హీరోయిన్స్ విషయంలో కొంత మంది అభిమానులు, సినీ ప్రియులు ఈ నెల 26 న విడుదల కాబోతున్న టాక్సిక్ తో రాకాకి పోలిక తెస్తున్నారు. టాక్సిక్ లో ఐదు హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే.
Raaka, Toxic, yash, Allu Arjun






