నవంబరు 17న ‘పుష్ప2 ది రూల్’ గ్రాండ్ ట్రైలర్ లాంచ్.. ఎక్కడో తెలుసా?
on Nov 11, 2024
టాలీవుడ్ హీరోలు నార్త్ ఇండియాకు ఎక్కువగా టార్గెట్ చేసినట్టున్నారు. అందుకే ప్రమోషన్స్‌ను అక్కడ కూడా చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రమోషన్స్ అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉండేవి. తెలుగు సినిమా మార్కెట్ బాగా విస్తరించిన నేపథ్యంలో ప్రమోషన్స్‌ను కూడా విభిన్నంగా చెయ్యడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ చిత్రం టీజర్‌ను ఎంతో ఘనంగా లక్నోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు సుకుమార్ టీమ్ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ సినిమా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం ప్రమోషన్ కార్యక్రమాలు ఇక ఎగ్రెసివ్‌గా స్టార్ అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.
అందులో భాగంగానే పుష్ప ది రూల్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను పాట్నాలో నిర్వహించనున్నారు. నవంబర్ 17 సాయంత్రం 6.03 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను ఎంతో ఘనంగా రిలీజ్ చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ మాసివ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గన్‌ను భుజాన వేసుకుని మాసివ్, ఫైర్ లుక్‌తో.. తనదైన స్వాగ్‌తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నడిచి వస్తున్న స్టిల్ చూస్తుంటే.. అల్లు అర్జున్ అభిమానులు గూజ్‌బంప్స్ ఖాయం.. ప్రస్తుతం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులను కూడా ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న పుష్ప ది రూల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది.
Also Read