Home

»

Latest News

ప్రతి ఒక్కడు దొంగే.. మంచోడికి చోటు లేదు.. పూరి షాకింగ్ ట్వీట్!

Jun 4, 2026 4:35PM

టాలీవుడ్ లో డ్యాషింగ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), నటి ఛార్మీ కౌర్ (Charmme Kaur) సంయుక్తంగా నడిపిస్తున్న నిర్మాణ సంస్థ 'పూరీ కనెక్ట్స్' (Puri Connects). ఈ బ్యానర్ నుండి వచ్చే సినిమాలు ఎంత వైల్డ్‌గా, రగ్గడ్‌గా ఉంటాయో.. వీరి సోషల్ మీడియా అప్‌డేట్స్ కూడా అంతే ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. 

అయితే, తాజాగా పూరీ కనెక్ట్స్ అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ నుండి ఒక విచిత్రమైన పోస్ట్ వచ్చింది. ఎప్పుడూ సినిమా ప్రమోషన్లు, షూటింగ్ అప్‌డేట్లతో సందడిగా ఉండే ఈ అకౌంట్‌లో హఠాత్తుగా ఒక క్రిప్టిక్ ట్వీట్ దర్శనమివ్వడంతో టాలీవుడ్ వర్గాలతో పాటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు పూరీ కాంపౌండ్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర గందరగోళంలో మునిగిపోయారు.

ఆ ట్వీట్ విషయానికి వస్తే.. "ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా.. మంచోడికి చోటు లేదురా" అంటూ పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్ తరహాలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. ఈ రెండు వాక్యాల వెనుక కొన్ని కోపంతో ఊగిపోతున్న ఎమోజీలను, మరికొన్ని నీరసపడిపోయిన నవ్వు ముఖం ఉన్న ఎమోజీలను కూడా జత చేశారు. 

సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమాల్లో సమాజాన్ని, మనుషుల స్వభావాన్ని ప్రశ్నించే ఇలాంటి పవర్ ఫుల్ వన్-లైనర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, ఒక అఫీషియల్ ప్రొడక్షన్ హౌస్ హ్యాండిల్ నుండి నేరుగా ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు రావడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ గుసగుసలాడుకుంటున్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? పూరీ కనెక్ట్స్ ఎవరితోనైనా మోసపోయిందా? లేదా ఇండస్ట్రీలో ఎవరైనా వీరికి తీవ్రమైన అన్యాయం చేశారా? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

మరోవైపు, ఈ ట్వీట్ వెనుక ఎలాంటి వివాదం లేదని, ఇది కేవలం ఒక సినిమా ప్రమోషన్ స్ట్రాటజీ మాత్రమేనని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్‌ను అలా పోస్ట్ చేసి ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, పూరీ జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్ మార్కెటింగ్‌ను ఎప్పుడూ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తుంటారు. మరి ఈ ట్వీట్ నిజమైన ఆవేదనా లేక సినిమా పబ్లిసిటీ స్టంట్లా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com