
- కమ్ బ్యాక్ కి రెడీ అయిన పూరి
- స్టార్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్
- స్లమ్‌డాగ్ తరువాత లైన్ లోకి క్రేజీ ప్రాజెక్ట్
ఒకప్పుడు టాలీవుడ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) అంటే ఒక బ్రాండ్. ఆయన హీరోలను చూపించే విధానం కానీ, డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అందుకే పూరితో సినిమా చేయడానికి స్టార్స్ కూడా పోటీ పడేవారు. అలాంటి పూరి కొంతకాలంగా వెనకబడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదిరిపోయే కమ్ బ్యాక్ కి సిద్ధమవుతున్నారు.
పూరి ప్రస్తుతం కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతితో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పూరి నెక్స్ట్ సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. (Slumdog – 33 Temple Road)

'స్లమ్‌డాగ్' తరువాత కూడా పూరి కోలీవుడ్ స్టార్ తోనే చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు సూర్య. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి. ఇది స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందనుందట. (Puri Suriya)
కాగా, సూర్య ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే, బాలకృష్ణ కోసం కూడా పూరి ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా సూర్య ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. దీని తర్వాత బాలయ్య-పూరి చేతులు కలుపుతారేమో చూడాలి. గతంలో వీరి కాంబినేషన్ లో 'పైసా వసూల్' వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ!








