Home

»

Latest News

Peddi: పెద్ది రిలీజ్ టైంలో కావాలనే ఇలా చేస్తున్నారా?

May 13, 2026

టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానానికి పట్టుబడుతుండగా, నిర్మాతలు రెంటల్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటూ తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. 

ఏ ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత శిరీష్ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) కూడా పాల్గొన్నారు. జూన్ 4న విడుదలవుతున్న రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాని టార్గెట్ చేస్తూ ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నారా? అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రశ్న శిరీష్ కి ఎదురవ్వగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

ఇది ఎవరినో టార్గెట్ చేసేది కాదని, కేవలం థియేటర్ల వ్యవస్థను కాపాడుకోవడానికి చేస్తున్న 'బ్రతుకు పోరాటం' అని శిరీష్ అన్నారు. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ, థియేటర్లు బతకాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఎవరినీ తక్కువ చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మన హీరోలు అందరూ మంచి మనసున్న వారని, పరిశ్రమను కాపాడుతున్నారని ఆయన కొనియాడారు. ఎగ్జిబిటర్ల సమస్యను అర్థం చేసుకుని హీరోలు తమకు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్లలో భారీ సెలబ్రేషన్స్ వల్ల డ్యామేజ్ జరుగుతున్నా, ఎగ్జిబిటర్లు అభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఫ్యాన్స్ కూడా ఈ క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు శిరీష్ చెప్పారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com