Home

»

Latest News

ప్రియాంక‌.. వారం వ్య‌వ‌ధిలో రెండు చిత్రాలు!

Jul 28, 2021 3:39PM

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన `టాక్సీవాలా`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ప్రియాంక జ‌వాల్క‌ర్. మొద‌టి సినిమాతోనే విజ‌యం అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. స్వ‌ల్ప విరామం అనంత‌రం కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. అది కూడా.. వారం వ్య‌వ‌ధిలో ప్రియాంక న‌టించిన రెండు సినిమాలు థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. స‌త్య‌దేవ్ కి జోడీగా ప్రియాంక‌ న‌టించిన `తిమ్మ‌రుసు` జూలై 30న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఆ సినిమా రిలీజైన వారం రోజుల‌కే ప్రియాంక నాయిక‌గా న‌టించిన మ‌రో చిత్రం రాబోతోంది. అదే.. `ఎస్.ఆర్. క‌ళ్యాణ‌మండ‌పం`. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఆగ‌స్టు 6న ఈ సినిమా థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

మ‌రి.. క‌రోనా సెకండ్ వేవ్ త‌రువాత థియేట‌ర్స్ లోకి వ‌స్తున్న ఈ సినిమాల‌తో ప్రియాంక ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటుందో చూడాలి. కాగా, ఈ రెండు చిత్రాల్లోనూ అభినయానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లోనే ప్రియాంక జ‌వాల్క‌ర్ క‌నిపించ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com