Home

»

Latest News

చైతూకి కలిసొచ్చిన సమంత..!

Oct 07, 2016

అక్కినేని నవయువ సామ్రాట్‌ నాగచైతన్యకి గృహలక్ష్మీతో పాటు విజయలక్ష్మీ కూడా దక్కినట్టే అనిపిస్తుంది. మనం సినిమా తర్వాత మూడు వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్న నాగచైతన్య ప్రేమమ్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే హిట్ వేటలో పూర్తిగా వెనుకబడటంతో ప్రేమమ్ హిట్టయి తీరాలి. అలాంటి పరిస్దితుల్లో ప్రేమమ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా చైతూ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఈ క్రెడిట్ అంతా చైతూ కాబోయే శ్రీమతి సమంతదే అంటున్నారు అక్కినేని అభిమానులు.

ఎందుకంటే ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి..పెద్దల అంగీకారంతో దానిని పెళ్లి పీటల దాకా తీసుకువచ్చాడు చైతన్య. అంటే ఆల్‌మోస్ట్ సగం పెళ్లి అయిపోయినట్లే..అంటే అనఫిషియల్‌గా సమంత అక్కినేని ఇంటి కోడలైపోయింది. ఆ విషయం బయటకి తెలిసిన తర్వాత ప్రేమమ్ రిలీజ్ కావడం..ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ అదృష్టమంతా సమంత వల్లే అంటున్నారు అక్కినేని అభిమానులు. ఇదే సెంటిమెంట్ త్వరలో విడుదలకాబోతున్న సాహసం శ్వాసగా సాగిపో విషయంలోనూ కొనసాగాలని వారు ఆశిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com