Home

»

Latest News

భర్తకి ఆ పూజ చేసిన ప్రణీత.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తుఫాన్

Aug 12, 2026 5:00PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత 'బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది,ఉంగరాలున్న జుట్టు తిప్పింది. గింగిరాలెత్తే నడుంఒంపుల్లో నన్నే తిప్పింది, ఆమ్మో  బాపు గారి బొమ్మో అని పాడేలా చేసుకున్న భామ ప్రణీత. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపునే పొందింది.

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును 2021 మే 30న వివాహం చేసుకున్న ప్రణీత, 2022 జూన్‌లో ఆర్నా అనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కుటుంబ విలువలకు, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ప్రణీత, హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన 'భీమన అమావాస్య' సందర్భంలో తన భర్త పాదాలకు పూజ చేస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భర్త దీర్ఘాయుష్షును కోరుకుంటూ, కుటుంబ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మహిళలు ఆచరించే భీమన అమావాస్య వేడుకల్లో భాగంగా ప్రణీత తన భర్త కాళ్ళ దగ్గర కింద నేలపై కూర్చొని పూజ నిర్వహిస్తున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది. అయితే ఈ ఫోటో బయటకు రాగానే నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజన్లు దీనిని "పురుషాధిక్యతను ప్రోత్సహించడం" అని, "సమాజంలో మహిళల స్థానాన్ని తగ్గించే పాతకాలపు ఆలోచన" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆధునిక కాలంలో ఒక గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే కథానాయిక ఇలాంటి పూజలు చేయడం ఏంటంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరికొందరైతే మీమ్స్ రూపంలో విమర్శలు గుప్పించి చర్చను మరింత వేడెక్కించారు. అయితే  ట్రోలింగ్‌పై  ప్రణీత  స్పందించారు.  ఆమె స్పందిస్తూ, "జీవితంలో ప్రతి విషయానికి రెండు వైపులా కోణాలు ఉంటాయి. కానీ ఈ విషయంలో దాదాపు 90 శాతం మంది ప్రజలు నన్ను సమర్థించారు, నా ఆచారానికి మద్దతు తెలిపారు. కేవలం 10 శాతం మంది మాత్రమే ప్రతికూలంగా మాట్లాడారు, ఆ నెగెటివిటీని నేను పూర్తిగా విస్మరిస్తాను" అని చాలా స్పష్టంగా చెప్పారు.

Also read: వైరల్ గా మారిన పోస్ట్: ఎన్టీఆర్ భామ రుక్మిణి వసంత్ కీలక నిర్ణయం

Pranitha Subhash, Pawan Kalyan, Tollywood

 


 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com