Home

»

Latest News

Pawan kalyan: రంగంలోకి దిగిన ప్రకాష్ రాజ్.. పవన్ పై ఘాటైన విమర్శలు 

Apr 30, 2026 10:19AM

 

సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Prakash raj)మధ్య వచ్చే సీన్స్ చూస్తే వచ్చే మజానే వేరు. రీసెంట్ గా ఆ ఇద్దరు ఓజిలో తండ్రి కొడుకులుగా చేసి సినిమా విజయాన్ని పెంచారు. కానీ రాజకీయ పరంగా ఆ ఇద్దరు భిన్న ధ్రువాలు. ఢీ  అంటే ఢీ అనే రీతిలో వెళ్తుండటం ఎప్పటికప్పుడు పాలిటిక్స్ కే స్పెషల్. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పై రీసెంట్ గా ప్రకాష్ రాజ్  మరోసారి  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటో చూద్దాం.


ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు  సెలెక్టివ్ గా ఉంటున్నాయి. కేవలం కొన్ని అంశాలపై మాత్రమే  గళం ఎత్తుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కేవలం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలను  పట్టించుకోవడం లేదు.

 తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.  ముఖ్యంగా మణిపూర్‌  హింసాకాండ, అక్కడ మహిళలపై జరిగిన దాడుల వంటి సున్నితమైన అంశాల గురించి మౌనానికి కారణమేంటి. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం మాత్రమే  విమర్శలు చేస్తున్నారు.  సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ అదే ధర్మంలో భాగంగా ఇతర అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదు. ఇలా సెలెక్టివ్ అంశాలనే ఎంచుకుని విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పుకొచ్చాడు.


Also read: Bellamkonda Sai Sreenivas: పెళ్లి పీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఉప ముఖ్యమంత్రి హాజరు

ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు పవన్  అభిమానులు, కూటమి నాయకులు ప్రకాష్ రాజ్ విమర్శలపై స్పందిస్తూ మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే పవన్ గట్టిగా స్పందిస్తున్నారు.ప్రకాష్ రాజ్ నే తన  పంథా మార్చుకొని సెలెక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రకాశ్ రాజ్ విమర్శలపై  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com