
నటనకి సంబంధించి ప్రకాష్ రాజ్(Prakash Raj)అనే పేరుకి ఉన్న పవర్ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. అంతలా తన పెర్ఫార్మ్ తో పాన్ ఇండియా సెల్యులాయిడ్ ని చెడుగుడు ఆడతాడు. రీసెంట్ గా ప్రకాశ్ రాజ్ కర్ణాటకలో సంచలనం సృష్టించిన ‘ధర్మస్థల’ వివాదంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిసంచలన వ్యాఖ్యలు చేశాడు.
ధర్మస్థలలో అనుమానాస్పద రీతిలో మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకుని, ప్రస్తుతం ‘ముసుగువ్యక్తి’గా తీవ్ర దుమారం రేపుతున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్యకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వివాదంలో నా పేరుని ఎందుకు లాగుతున్నారు. అసలు చిన్నయ్య అనే వ్యక్తితో తనకు ఎలాంటి లావాదేవీలు గానీ, పరిచయాలు గానీ లేవని బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ వివరించారు.
ధర్మస్థల క్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి ఏకంగా 200 కోట్ల నిధులు వచ్చాయనేది కూడా అబద్దం. నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ధర్మస్థలకి వెళ్లలేదు. కనీసం ఆ ఆలయ నిర్వాహకులని లేదా ఆ వ్యవస్థతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ కూడా నేను ఏనాడూ కలవలేదు. ఒక సాధారణ వ్యక్తి చేసిన నిరాధారమైన ఆరోపణల వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: Peddi: మూడవ భారతీయ చిత్రంగా పెద్ది.. ఫ్యాన్స్ సంబరాలు
ఒకప్పటి పోలీసు అధికారి, ప్రస్తుతం సహ కార్యకర్తగా ఉన్న గిరీశ్ మట్టణ్ణనవర్ నాకు ఫోన్ చేసి మండ్యకు చెందిన చిన్నయ్య అనే వ్యక్తి మీతో మాట్లాడాలని అంటే మాట్లాడాను. చిన్నయ్య తనతో కన్నడ భాషలో మాట్లాడకుండా, తమిళంలో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత చిన్నయ్య స్వయంగా వచ్చి తనను భేటీ అవుతానని కోరగా, తాను దానికి పూర్తిగా నిరాకరిస్తూ ఒక ‘వాయిస్ నోట్’ మాత్రమే పంపించానని ఆయన పూర్తి వివరాలను బయటపెట్టారు.






