Home

»

Latest News

11 ఏళ్ల త‌ర్వాత‌ మ‌ళ్లీ పెళ్లిచేసుకున్న ప్ర‌కాశ్‌రాజ్‌-పోనీవ‌ర్మ‌! ఎందుకంటే...

Aug 25, 2021 10:44AM

 

ప్ర‌కాశ్‌రాజ్‌, ఆయ‌న భార్య పోనీ వ‌ర్మ 11 ఏళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆగ‌స్ట్ 24 వారి పెళ్లిరోజు. కొడుకు వేదాంత్ కోస‌మే వారు మ‌రోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్ర‌కాశ్‌రాజ్ షేర్ చేసుకున్నారు. నాలుగు ఫొటోల‌ను షేర్ చేసిన ఆయ‌న‌, "ఈ రాత్రి మేం మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నాం.. ఎందుకంటే మా అబ్బాయి వేదాంత్ ఆ పెళ్లి చూడాల‌నుకున్నాడు" అని రాసుకొచ్చారు. ఆ ఫొటోల్లో వారంతా చాలా చాలా ఆనందంగా క‌నిపిస్తున్నారు. అనురాగం, ఆత్మీయ‌త‌ల‌తో త‌మ అనుబంధాన్ని చాటి చెబుతున్నారు. 

ప్ర‌కాశ్‌రాజ్‌కు పోనీవ‌ర్మ రెండో భార్. అదివ‌ర‌కు ఆయ‌న డిస్కో శాంతి చెల్లెలు ల‌లిత‌కుమారిని 1994లో వివాహం చేసుకున్నారు. 15 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితం త‌ర్వాత 2009లో విడిపోయారు. ఆ ఇద్ద‌రికీ ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు క‌లిగారు. అయితే 2004లో కుమారుడు సిద్ధు చ‌నిపోయాడు. 

ల‌లిత‌కుమారికి విడాకులు ఇచ్చిన త‌ర్వాత బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ అయిన పోనీవ‌ర్మ‌తో ప్రేమ‌లో ప‌డ్డారు ప్ర‌కాశ్‌రాజ్. ఆ ఇద్ద‌రూ ఓ బాలీవుడ్ మూవీ సెట్స్‌లో క‌లుసుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్యా పెరిగిన స్నేహం చాలా త్వ‌ర‌గా ప్రేమ‌గా మారింది. ఆ ఇద్ద‌రూ 2010 ఆగ‌స్ట్ 24న వివాహం చేసుకున్నారు. అప్పుడు ప్ర‌కాశ్ వ‌య‌సు 45 సంవత్స‌రాలు. 2015లో వారికి వేదాంత్ పుట్టాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com