Home

»

Latest News

'సీటీమార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్!

Sep 1, 2021 2:16PM

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీటీమార్'. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ హాజరు కానున్నారని న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

'సీటీమార్' మూవీ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న‌ విడుదల కాబోతోన్న నేప‌థ్యంలో..  సెప్టెంబర్ 4 లేదా 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని, ఆయన కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి ఓకే చెప్పారని సమాచారం.

'వర్షం' సినిమాలో ప్రభాస్, గోపీచంద్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య ఫ్రెండ్ షిప్ నడుస్తోంది. ఇద్దరూ ఇప్పటికే పలు వేడుకల్లో వేదిక పంచుకున్నారు. ఇప్పుడు 'సీటీమార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరోసారి వేదిక పంచుకోనున్నారట. మరి ప్రభాస్ రాక సీటీమార్ కు ఎంత హైప్ తీసుకొస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com